భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, స్టార్ బౌలర్ సిద్ధార్థ్ శర్మ(28) మృతి చెందాడు. గత కొన్ని రోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధార్థ్.. గుజరాత్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం తుది శ్వాస విడిచాడు.
కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధార్థ్ తన జట్టుతో కలిసి గుజరాత్‌లో ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట అతడు తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో హుటహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
కాగా తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ జట్టులో సిద్ధార్థ్ శర్మ భాగంగా ఉన్నాడు. ఇక సిద్ధార్థ్ శర్మ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఇక శుక్రవారం భాభోర్ సాహెబ్ శ్మశానవాటికలో సిద్ధార్థ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన 25 వికెట్లు పడగొట్టాడు.
मुख्यमंत्री श्री @SukhuSukhvinder ने हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री ने शोक संतप्त परिजनों के साथ अपनी गहरी संवेदनाएं व्यक्त की हैं।
— CMO HIMACHAL (@CMOFFICEHP) January 13, 2023
చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు'
Comments
Please login to add a commentAdd a comment