Siddharth Sharma
-
భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. స్టార్ బౌలర్ మృతి
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, స్టార్ బౌలర్ సిద్ధార్థ్ శర్మ(28) మృతి చెందాడు. గత కొన్ని రోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధార్థ్.. గుజరాత్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం తుది శ్వాస విడిచాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధార్థ్ తన జట్టుతో కలిసి గుజరాత్లో ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట అతడు తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో హుటహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ జట్టులో సిద్ధార్థ్ శర్మ భాగంగా ఉన్నాడు. ఇక సిద్ధార్థ్ శర్మ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం భాభోర్ సాహెబ్ శ్మశానవాటికలో సిద్ధార్థ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6 మ్యాచ్‌లు ఆడిన 25 వికెట్లు పడగొట్టాడు. मुख्यमंत्री श्री @SukhuSukhvinder ने हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री ने शोक संतप्त परिजनों के साथ अपनी गहरी संवेदनाएं व्यक्त की हैं। — CMO HIMACHAL (@CMOFFICEHP) January 13, 2023 చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
ఐ లవ్ యూ రా.. ప్లీజ్ తిరిగిరారా!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 4న జరిగిన మెర్సిడెస్ హిట్ అండ్ రన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిద్దార్థ శర్మ జ్ఞాపకాలను అతని సోదరి శిల్పా శర్మ ఫేస్బుక్లో పంచుకుంది. సిద్ధార్థ బతికుంటే జూన్ 5న 33వ ఏట అడుగుపెట్టేవాడని పేర్కొంది. అతనితో దిగిన ఫొటోలను శిల్ప పోస్ట్ చేసి.. సోదరుడికి ఓ లేఖ రాసింది. 'నీ పుట్టినరోజున బాధగా ఉండాలని భావించడం లేదు. నాకు తెలుసు నీవు మా మధ్యే ఉన్నావు. నన్ను చూడగలవు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లినందుకు బాధగా ఉంది. నిన్ను నా తమ్ముడిగా ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఐ లవ్ యూ. ప్రతి క్షణాన్ని మిస్సవుతున్నా. జరిగిన దారుణం మరచిపోవడం తేలికకాదు. నీతో కలసి పెరిగిన జ్ఞాపకాలు ఎంతో అద్భుతమైనవి. నీవు నా సోదరుడు అయినందుకు గర్వంగా ఉంది. నీలోని మానవత్వానికి మరింత గర్వంగా ఉంటుంది. నీ చిరునవ్వు ఎప్పటికీ నాలో పదిలంగా ఉంటుంది. ఐ లవ్ యూ. ప్లీజ్ కమ్ బ్యాక్. ఏదో ఒక రోజు నీవు తిరిగొచ్చి.. మళ్లీ వచ్చానని చెబుతావని ఆశిస్తున్నా'.. అంటూ శిల్ప రాసిన లేఖను ఆమె ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఫేస్బుక్లో 'మెర్సిడెస్ హిట్ అండ్ రన్' పేరుతో ఓ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలతో కూడిన సీసీటీవీ ఫుటేజీని పోస్ట్ చేశారు. మీడియా ప్రమాద ఘటన వెలుగులోకి తేవడంతో పాటు పోలీసులు నిందితుడైన మైనర్ బాలుడిపై చర్యలు తీసుకునేలా ఈ ఫేస్ బుక్ పోస్టింగ్ దోహదం చేసింది. మార్కెటింగ్ ప్రొఫెసనల్ అయిన సిద్ధార్థను ఏప్రిల్ 4న మెర్సిడెస్ కారు ఢీకొనడంతో 15 అడుగుల ఎత్తుకు ఎగిరిపడి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో మరణించాడు. వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసు విచారణ సాగుతోంది. సిద్ధార్థకు న్యాయం జరగాలని పోరాడుతున్నవారికి అతని జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం ఇంట్లో తేనీరు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.