![Himachal Pradesh Extends Lockdown Till June 30 - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/25/himachal%20pradesh.jpg.webp?itok=8DT_6hwo)
సిమ్లా : కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్‌లో ప్రస్తుతం 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో 63 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఐదుగురు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం, కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన క్రమంలో హిమాచల్‌ప్రదేశ్ లాక్‌డౌన్‌ను పొడిగించడం గమనార్హం.
ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. అత్యధిక కేసులతో తల్లిడిల్లుతున్న మహారాష్ట్ర మాత్రమే ఇప్పటివరకూ లాక్‌డౌన్ పొడిగింపును కోరుతోంది. మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత మూడుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment