సాక్షి, సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ రామసుబ్రమణియన్ పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ శాఖ నియమించిన విషయం విదితమే. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ కావడంతో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను నియమించాలని మే 10న సుప్రీం కోర్టు కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment