Justice Rama Subramanian
-
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
హైకోర్టు సీజేగా జస్టిస్ రామసుబ్రమణియన్
సాక్షి, సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ రామసుబ్రమణియన్ పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ శాఖ నియమించిన విషయం విదితమే. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ కావడంతో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను నియమించాలని మే 10న సుప్రీం కోర్టు కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. -
కాబోయే హిమాచల్ సీజేకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు హైకోర్టు గురువారం ఘనం గా వీడ్కోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు సభకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్ష త వహించారు. జస్టిస్ రామసుబ్రమణియన్‌ను పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కేసుల్ని సత్వరంగా పరిష్కరించడంలో, విభి న్న కేసుల్లో ఆయన అందించిన న్యాయసేవల్ని జస్టిస్ చౌహాన్ కొనియాడారు. ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచి హైకోర్టులో న్యాయవాదు లు, సిబ్బంది అందించిన సహకారానికి జస్టిస్ రామసుబ్రమణియన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, పలువురు న్యాయవాదులు, జస్టిస్ రామసుబ్రమణియన్ భార్య సరస్వతి, కుమారుడు దర్శన్, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. ఈ బదిలీతో హైకోర్టులో ఏసీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 11కు తగ్గింది. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో కూడా జస్టిస్ రామసుబ్రమణియన్కు న్యాయవాదులు జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్‌తో గవర్నర్ నరసింహన్ 22న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. వీరికి పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్, జస్టిస్ బాబ్దే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో నోటిఫికేషన్ జారీ అయింది. జస్టిస్ రామసుబ్రమణియన్కు గురువారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. ఈ నెల 22న సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టుకి బదిలీ అయ్యారు. దీంతో జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం... జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సినీయర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత కేంద్రం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఇప్పుడు పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
వైద్య కళాశాలలకు హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య కళాశాలలకు హైకోర్టు గట్టి ఝలక్‌నిచ్చింది. డెక్కన్ మెడికల్ కాలేజీ అడిగిందే తడువుగా, యాజమాన్యపు కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల ఫీజును రూ.5.85 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఓ కాలేజీ అడిగిన వెంటనే ఫీజు నియంత్రణ కమిటీ నివేదిక సమర్పించక ముందే ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినట్లయిందని తెలిపింది. అందువల్ల పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫీజును రూ.5.85 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 78ను రద్దు చేసింది. పిటిషనర్ నుంచి పెంచిన ఫీజును వసూలు చేసి ఉంటే, ఆ మొత్తాన్ని అతనికి నాలుగు వారాల్లో వాపసు చేయాలని సంబంధిత కాలేజీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఫీజు నియంత్రణ కమిటీని సంప్రదించలేదు పిటిషనర్ తరఫున సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫీజులను నిర్ణయించాల్సింది ఫీజు నియంత్రణ కమిటీ అని ఈ కమిటీని సంప్రదించకుండానే ఫీజును రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచేసిందని తెలిపారు. కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం, డెక్కన్ మెడికల్ కాలేజీ విజ్ఞప్తి మేరకు ఫీజును రూ.25 లక్షలకు పెంచినట్లు పేర్కొంది. డెక్కన్ మెడికల్ కాలేజీ నుంచి వినతి రాగానే, దానిపై ఫీజు నియంత్రణ కమిటీకి లేఖ రాశామని తెలిపింది. సుప్రీం తీర్పును గాలికొదిలి.. ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ప్రభుత్వం ఫీజును రూ.25 లక్షలకు పెంచుతూ జీవో జారీ చేసినట్లు ధర్మాసనం గుర్తించింది. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గాలికొదిలేసిందని, ఈ ఒక్క కారణంతోనే జీవోను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే డెక్కన్ మెడికల్ కాలేజీ ఫీజును పెంచడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో యాజమాన్యపు కోటా ఫీజు ఈ స్థాయిలోనే ఉందని తెలిపింది. అయితే దీనితో ధర్మాసనం విభే ధించింది. పొరుగు రాష్ట్రాల్లో ఫీజులు ఎంత ఉన్నాయి.. ఇక్కడ ఎంత ఉన్నాయి.. అన్న అంశాలను పరిశీలించేందుకు తామేమీ ఫీజు నియంత్రణ కమిటీ కాదంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట నిబంధనలకు లోబడి ఉందా? లేదా? అన్నది మాత్రమే చూస్తామని స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా జీవో 78 జారీ చేసే విషయంలో నిబంధనలను అనుసరించలేదని ధర్మాసనం తేల్చింది. అందువల్ల ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఫీజు పెంచిన సర్కార్... ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన వై.అనిల్‌రెడ్డి 2018లో నీట్ పరీక్ష రాసి, మమతా మెడికల్ కాలేజీ యూరాలజీ విభాగంలో సీటు సాధించారు. ఆ వెంటనే అనిల్ ఆ కాలేజీలో చేరారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు మొదటి దశ కౌన్సెలింగ్‌ను 2018 ఆగస్టు 1నుంచి 5 వరకు నిర్వహించారు. రెండో దశ కౌన్సెలింగ్‌ను 16నుంచి 19 వరకు నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయ్యే నాటికి ప్రైవేటు అన్ ఎయిడెడ్ మైనారిటీ వైద్య కళాశాలల్లో యాజమాన్యపు కోటా కింద ఫీజు రూ.5.85 లక్షలు (2011లో జారీ చేసిన జీవో 167 ప్రకారం)గా ఉంది. కన్వీనర్ కోటా కింద నాన్ మైనారిటీ కాలేజీల్లో రూ.3.70 లక్షలుగా, యాజమాన్యపు కోటా కింద రూ.7.50 లక్షలుగా ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే యాజమాన్య కోటా కింద ఫీజులను ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో 78 జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ అనిల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ రామసుబ్రమణియన్ ధర్మాసనం విచారణ జరిపింది. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామసుబ్రమణియన్ ప్రమాణం
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే మంగళవారం ఉదయం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, జస్టిస్ రామసుబ్రమణియన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావులతో కలిసి ఆయన కేసుల విచారణ చేపట్టారు. మద్రాసు హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రామసుబ్రమణియన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు . 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు . 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రామసుబ్రమణియన్కు మంచి వక్తగా పేరుంది.