తెలంగాణకు కాంస్యం... విజేత హిమాచల్‌  | Telangana Wins Bronze In National Women Handball Championship | Sakshi
Sakshi News home page

National Women Handball Championship: తెలంగాణకు కాంస్యం... విజేత హిమాచల్‌ 

Published Mon, Apr 4 2022 7:44 AM | Last Updated on Mon, Apr 4 2022 7:44 AM

Telangana Wins Bronze In National Women Handball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ టోర్నీలో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీ సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్‌ప్రదేశ్‌ జట్టు చేతిలో ఓడింది.  ఫైనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ 20–10తో రైల్వేస్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement