
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా బీజేపీ ముఖ్యనేతలు శనివారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రెండుగంటలకు పైగా జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అక్కడి 68 స్థానాల అభ్యర్థుల జాబితాకు తుదిరూపుపై చర్చించారు.
ఆదివారం అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ భేటీలో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. నడ్డా వైపే పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment