సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గానూ 40 మందితో స్టార్ క్యాం పెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ మేర కు ఆ జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ అందజేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఆ జాబితాలోని నేతలంతా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో షెడ్యూల్‌ను బీజేపీ సిద్ధం చేస్తోంది.
జాబితాలోని వారు..
జాబితాలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితి న్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్‌లాల్, జగత్ ప్రకాష్ నడ్డా, నిర్మలా సీతారామన్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, యోగీ ఆదిత్యనాథ్, హేమామాలిని, అరవింద్ లింబావలి, సుగుణాకర్‌రావు, పురుషోత్తం రూపాల, సాధ్వి నిరంజన్‌జ్యోతి, సౌదాన్ సింగ్, కృష్ణదాస్, మురళీధర్‌రావు, రాం మాధవ్, సయ్యద్ షానవాజ్ హుస్సేన్, జీవీఎల్ నర్సింహారావు, సురేశ్ ప్రభు ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా 13 మంది రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
Published Wed, Mar 27 2019 5:12 AM | Last Updated on Wed, Mar 27 2019 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment