ఈసీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు | Supreme Court Warned Election Commission For Modi And Amit Shah Issue | Sakshi
Sakshi News home page

ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌

Published Thu, May 2 2019 3:52 PM | Last Updated on Thu, May 2 2019 4:07 PM

Supreme Court Warned Election Commission For Modi And Amit Shah Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా ప్రసంగాలపై ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. తమ ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లఘించేలా ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే మోదీ, అమిత్‌ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా.. ఈసీ చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. సుప్రీంకోర్టు ఈసీకి డెడ్‌లైన్‌ విధించింది.

ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై వచ్చిన ఫిర్యాదులపై మే 6లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీకి అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో 9 ఫిర్యాదులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అందుకు సమయం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఆదివారం వరకు సమయం ఉన్నందున త్వరగా ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement