లోక్‌సభ ఎన్నికల తుది దశలో కొనసాగుతున్న పోలింగ్‌ | Lok Sabha Elections 2024 Phase 7 Voting Live Updates | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Published Sat, Jun 1 2024 7:00 AM | Last Updated on Sat, Jun 1 2024 5:50 PM

Lok Sabha Elections 2024 Phase 7 Voting Live Updates

చండీగఢ్‌ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ 

ఒడిశాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌  

Lok Sabha Election 2024 Phase 7 Updates..

 సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ 58.34 శాతం

బీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదు

ఛండీఘడ్ లో  62.80 శాతం పోలింగ్ నమోదు

హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్  నమోదు

ఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదు

పంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదు

ఉత్తరప్రదేశ్  13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదు

పశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు

👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్‌ నమోదు 

  • ఢిల్లీ:
  • 7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09
  • బీహార్(8)-35.65
  • ఛండీఘడ్(1)-40.14
  • హిమాచల్ ప్రదేశ్(4)-48.63
  • జార్ఖండ్(3)-46.80
  • ఒడిస్సా(6)-37.64
  • పంజాబ్(13)-37.80
  • ఉత్తరప్రదేశ్ (13)- 39.31
  • పశ్చిమ బెంగాల్( 9)-45.07

 

👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్‌కత్తాలోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను.

 

 

👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్‌ సాహో మృతి
ఓడిషాలో బింజర్‌హర్‌పూర్‌  అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-157లో బూత్‌ లెవన్‌ ఆఫీసర్‌ మనోరంజన్‌ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్‌ నిఖిల్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

 

👉ఓటు వేసిన నటుడు ఆయూష్‌మాన్‌ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

 


👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. 
యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. 
 

 

 

👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌.

👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజితియా.

 

👉  ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్‌ బూత్‌లో​ ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. 

 

👉 11 గంటల వరకు 26.30 పోలింగ్‌ శాతం నమోదు. 

ఢిల్లీ:

  • 7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30
  • బీహార్(8)-24.25
  • ఛండీఘడ్(1)-25.03
  • హిమాచల్ ప్రదేశ్(4)-31.92
  • జార్ఖండ్(3)-29.50
  • ఒడిస్సా(6)-22.64
  • పంజాబ్(13)-23.91
  • ఉత్తరప్రదేశ్ (13)- 28.02
  • పశ్చిమ బెంగాల్( 9)-28.10

 


👉ఓటు వేసిన హిమాచల్‌ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

 

👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన వేశారు.

 

👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. 

 

👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ ప్రెసిడెంట్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎస్‌ఏడీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీరు ఓటు వేశారు. 


 

👉పోలింగ్‌ వేళ బెంగాల్‌లో ఉద్రిక్తతలు..
సౌత్‌ పరగాణా-24లో పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. 

 

 

 

👉 ఓటు వేసిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌. 

 

 

 

👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్‌. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

 

 

👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్‌. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. 
 

 

 

👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్‌ నమోదు.. 

ఢిల్లీ:

  • చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31
  • బీహార్(8)-10.58
  • ఛండీఘడ్(1)-11.64
  • హిమాచల్ ప్రదేశ్(4)-14.35
  • జార్ఖండ్(3)-12.15
  • ఒడిస్సా(6)- 7.69
  • పంజాబ్(13)-9.64
  • ఉత్తరప్రదేశ్ (13)- 12.94
  • పశ్చిమ బెంగాల్( 9)- 12.63

 

 

👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్‌ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 
 

 

 

👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. 

 

 

👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

 

👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్బజన్‌ సింగ్‌. జలంధర్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్‌ చేశారు. 
 

 

👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ వేసిన రవి కిషన్‌, ఆయన కుటుంబ సభ్యులు. 

 

 

 

👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్‌. 

 

 

 

 

👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా

 

 

👉 ఓటు వేసిన ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా..

👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్‌ చద్దా.. 

 

👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 

 

 

👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 

👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 

👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్‌లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.

👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు ఉన్నాయి.  ఏప్రిల్‌ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 2న ప్రారంభమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement