టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ ఓ యోధుడు అని అశ్విన్ కొనియాడాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో అశ్విన్ సంభాషించాడు. ఈ సందర్భంగా గంభీర్ వరల్డ్‌కప్ ప్రదర్శనల గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు.
"మన దేశంలో గంభీర్‌ను చాలా మంది అపార్ధం చేసుకున్నారు. అతడొక గొప్ప టీమ్‌మ్యాన్. జట్టు కోసం పోరాడటానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అతడు ముఖంలో పెద్దగా ఉద్వేగాలు కన్పించకపోయినా ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి. వరల్డ్‌కప్‌లో ఫైనల్‌లో మాత్రమే కాదు, అతడు అటువంటి ఇన్నింగ్స్‌లు భారత జట్టు కోసం ఎన్నో ఆడాడు.
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సచిన్ టెండూల్కర్ ,వీరేంద్ర సెహ్వాగ్ వెంటవెంటనే ఔటైనప్పుడు గౌతీ జట్టుపై ఎటువంటి ఒత్తడి కలగకుండా చేశాడు. ఆ కాసేపటికే విరాట్ కోహ్లి కూడా పెవిలియన్‌కు చేరాడు. కానీ గంభీర్ మాత్రం శ్రీలంక బౌలర్లకు ఎదురు నిలబడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఈజీగా 120-130 పరుగులు చేసే అవకాశమున్నా నిస్వార్థంగా ఆడాడు" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
కాగా 2007 టీ20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్‌లను సొంతం టీమిండియా సొంతం చేసుకోవడంలో గంభీర్ ది కీలక పాత్ర. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గెలిచిన రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు.
2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో జోహన్నెస్ బర్గ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 75 పరుగులు చేశాడు గంభీర్. 2011 వరల్డ్‌కప్‌లో ముంబైలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు డు. గంభీర్ తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడి 4154, 5238, 932 పరుగులు చేశాడు.
చదవండి: WC 2023: టీమిండియాతో తొలి మ్యాచ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! స్టార్ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment