భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ధోనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని పేరు తెలియని వారు క్రికెట్ ప్రపంచంలో ఉండరు. ధోని సారథ్యంలో భారత క్రికెట్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. అంతర్జాతీయ టీ-20 వరల్డ్ కప్‌ను, 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలిపొందింది. అలాగే 2013లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో ధోనిని చాలా సందర్భాలలో డైనమిక్ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పోలుస్తూ ఉంటారు.
సౌరవ్‌గంగూలీ తన కెప్టెన్సీలో ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆడే అవకాశం కల్పించారు. యువరాజ్‌సింగ్, హర్భన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ఖాన్ లాంటి ఎంతో మందికి జట్టులో ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. గంగూలీ సారథ్యంలో ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఇదే విషయంపై గంభీర్ మాట్లాడుతూ.. గంగూలీ సారథ్యంలో ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లు ప్రపంచానికి పరిచయం అయ్యారని, అది ధోని విషయంలో జరగలేదన్నాడు. ధోని తన తరువాత వచ్చిన విరాట్ కోహ్లికి ఎక్కువ మంది క్వాలిటీ ప్లేయర్లను అందించలేదన్నారు. ధోని నాయకత్వంలో కోహ్లి, రోహిత్ శర్మ, బూమ్రా లాంటి వారు మాత్రమే క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారన్నారు. గంగూలీ మాత్రం యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ఖాన్ లాంటి అత్యుత్తమ క్రికెటర్లను అందించాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment