
లోక్‌సభ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్‌లో బాలిక బలవంత మత మార్పిడికి మద్దతునిచ్చిన వారిపై విరుచుకుపడ్డారు. నంకనా సాహిబ్ గురుద్వారలో జరిగిన ఘటనను వ్యతిరేకిస్తూ శనివారం ఆయన ట్వీట్ చేశారు. బాలికను బెదిరించి బలవంతంగా మత మార్పిడి చేయించారని, అడ్డువచ్చిన పర్యాటకులను రాళ్లతో కొట్టారని మండిపడ్డారు. అదేవిధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఫేక్ ట్వీట్‌పై స్పందిస్తూ ‘సైన్యం చేతిలో తోలుబొమ్మ’ అంటూ ఎద్దేవా చేశారు. ‘బలవంత మతమార్పిడికి మద్దతుగా.. అమాయక పర్యాటకులను రాళ్లతో కొట్టడమే పాకిస్తాన్ అంటే. ఇండియా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునిస్తుంటే, పాకిస్తాన్ సైన్యం తోలు బొమ్మ మాత్రం నకిలీ వీడియోలను ట్వీట్ చేసి తనని తానుగా మూర్ఖుడిగా నిరూపించుకోవడంలో బిజీగా ఉన్నాడు’ అంటూ గంభీర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Death threats and stone pelting to innocent tourists to support forcible conversion of a girl! This is Pakistan and that is why #IndiaSupportsCAA
— Gautam Gambhir (@GautamGambhir) January 4, 2020
Meanwhile, Pakistan army’s puppet is busy making a fool of himself by tweeting fake videos. #JagjitKaur #NankanaSahib pic.twitter.com/vkNQhvTWIw
కాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియోను షేర్ చేసి.. ‘భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో 2013 బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఘటనకు సంబంధించిందని నెటిజన్లు వెల్లడించి, ట్రోల్ చేయడంతో తన తప్పును తెలుసుకుని ఇమ్రాన్ తన ట్వీట్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment