టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే ఔననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజాను వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక భారత జట్టులో రవీంద్ర జడేజాకు సెలక్టర్లు చోటివ్వలేదు. గత దశాబ్ద కాలంగా భారత జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్న జడేజాను సెలక్టర్లు లంక సిరీస్‌కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానాన్ని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలకర్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20ల్లో భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. వన్డేల్లో కూడా జడ్డూ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.
దీంతో జడేజా ఇకపై టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జడ్డూ అద్బుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్‌మెంట్ పడింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టెస్టుల్లో మాత్రం జడ్డూ కొనసాగుతాడని పేర్కొన్నారు.
కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాను పక్కన పెట్టడంలో భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అతడు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటివరకు 197 వన్డేలాడిన జడ్డూ 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment