టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన శాంసన్.. నాలుగో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ శాంసన్ నిరాశపరిచాడు. ఒక సులభమైన క్యాచ్‌ను శాంసన్ జారవిడిచాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతిని ఫుల్ అండ్ ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఓవర్టన్‌కు సంధించాడు. ఆ బంతిని ఓవర్టన్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం వరుణ్ చక్రవర్తి, శాంసన్ ఇద్దరూ పరిగెత్తారు. అయితే సంజూ సమయానికి చేరుకున్నప్పటికి సులభమైన క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.
వాస్తవానికి చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి అందుకోవాల్సిన క్యాచ్‌కు శాంసన్ మధ్యలోకి వెళ్లి జారవిడచాడు. దీంతో డౌగట్‌లో ఉన్న భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Goutham Gambhir) ఆసంతృప్తికి లోనయ్యాడు. గంభీర్ ముఖం చేయి వేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఓవర్టన్ క్యాచ్ అంత కాస్టలీగా మారలేదు. ఆ తర్వాతి ఓవర్‌లనే ఓవర్టన్ ఔటయ్యాడు.
సిరీస్ భారత్ సొంతం..
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
భారత టాపార్డర్ విఫలమైనప్పటికి హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), రింకూ సింగ్(30) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా రావడం కాస్త వివాదస్పదమైంది.
చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు
— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment