
PC: Twitter
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. వీరిద్దరూ మరోసారి జెంటిల్ మేన్ గేమ్‌ని వీధిపాలు చేశారు.
ఏం జరిగిందంటే?
ఈ ఏడాది సీజన్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో కోహ్లి రివేంజ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగినట్లు సృష్టంగా కన్పించింది. లక్నో వికెట్లు పడినప్పుడు దూకుడుగా సెల్రబేషన్స్ చేయడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేశాడు.
ఈ క్రమంలో లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్‌లో పేసర్ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య చిన్న పాటి మాటల యుద్దం జరిగింది. అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది.
చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.
చదవండి: #Kohli, Gambhir Fight: గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా
పో నేనేం సారీ చెప్పను..
ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లి, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్‌ను కోహ్లికి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేం సారీ చెప్పను పో అన్నట్టుగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరి ఇంత తలపొగరా?
ఇక నవీన్ ఉల్-హక్ ప్రవర్తనపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో ఇటువంటి సహజం. దాన్ని సీరియస్‌గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటి? మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. కింగ్ ఏం చేశాడంటే?
Naveen😭😭😭
— Masum💛 (@chicken_heartz) May 1, 2023
king ko apne ling pe rakh raha pic.twitter.com/O4Qf0tVZyz
The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49
— Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023