ఢిల్లీ: ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్ అసలైన బ్యాటింగ్ విశ్వరూపాన్ని మనం ఇంకా చూడలేదని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. గత మూడు సీజన్లలో సగటు 50 కి పైగా ఉన్నప్పటికి రాహుల్ నుంచి పెద్ద హిట్టింగ్ ఇంకా కనిపించలేదని, ఐపీఎల్ రెండో దశలో అద్భుతంగా రాణిస్తాడని అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో చెప్పాడు. కోహ్లి 2016సీజన్‌లో ఆడినట్లు రాహుల్‌కు కూడా ఆడే సత్తా ఉందని అతడు తెలిపాడు. రాహుల్ ఒకే సీజన్‌లో 2,3 సెంచరీలు సాధించగలడని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలతో సహా 331 పరుగులు చేశాడు. 2021 ఐపిఎల్‌లో అత్యధిక స్కోరర్‌ల జాబితాలో అతను రెండవ స్థానంలో ఉన్నాడని గంభీర్ తెలియచేశారు.
ఇతర జట్ల గురించి మాట్లాడుతూ.. యూఏఈలో పరిస్థితులు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా ఉంటాయని గంభీర్ వివరించారు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి..కనుక ముంబై బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ చేలరేగతారని గంభీర్ పేర్కొన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌కు బౌలర్లనుంచి కఠిన సవాళ్లు ఎదురవుతాయని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది.
చదవండి: Virat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment