అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. నేను అది సహించలేను: గంభీర్‌ | Gautam Gambhir Breaks Silence On Asia Cup Middle-Finger Viral Video - Sakshi
Sakshi News home page

అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. నేను అది సహించలేను: గంభీర్‌

Published Tue, Sep 5 2023 11:41 AM | Last Updated on Tue, Sep 5 2023 12:46 PM

Gautam Gambhir Breaks Silence On Asia Cup Middle Finger Viral Video - Sakshi

టీమిండియా మూజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మరోసారి తన చర్యతో వార్తలకెక్కాడు. ఆసియాకప్‌-2023లో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు గంభీర్‌ మిడిల్‌ ఫింగర్‌ చూపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఫ్యాన్స్‌ కోహ్లి, కోహ్లి అంటూ గట్టిగా అరుస్తుండగా.. గంభీర్‌ తన మిడిల్‌ ఫింగర్‌ చూపించడం కన్పించింది. తాజాగా ఈ వీడియోపై గంభీర్‌ స్పందించాడు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే తను అలా రియాక్ట్‌ అయ్యానని గంభీర్‌ తెలిపాడు.

అది నిజం కాదు..
"సోషల్‌ మీడియలో మీరు చూస్తున్నది నిజం కాదు. ఎందుకంటే నేను ఎవరి ఫ్యాన్స్‌కి వ్యతిరేకిని కాదు. అక్కడ జరిగింది వేరు.. వీడియోలో ఉన్నది ఒకటి. అక్కడ కొంతమంది పాకిస్తానీలు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఇలానే రియాక్ట్‌ అవుతా.  అటువంటివి విని నేను నవ్వుతూ వెళ్లిపోలేను" అంటూ గంభీర్‌ క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: ఆ సమయంలో చాలా నిరాశ చెందా.. అది క్షమించరానిది: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement