దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరన్నది అందరి మెదడులని తొలుస్తున్న ప్రశ్న. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. కపిల్ దేవ్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత్‌కు దొరకకపోతే, తర్వాత ఏమి చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని గంభీర్ తెలిపాడు.
"భారత జట్టులో కపిల్ దేవ్‌లాంటి ఆల్‌రౌండర్ లేరని మనకు తెలుసు. జట్టులో లేని దానికోసం ప్రయత్నించకూడదు. ఈ నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. తదుపరి కపిల్ దేవ్‌ను వెతికే ప్రయత్నాలనుంచి భారత్ బ్రేక్ తీసుకోవాలి. జట్టును నడపించగల సత్తా ఉన్న ఆటడాడికి భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి. ఇక క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయిలో కాకుండా దేశీయ స్థాయిలోనే అత్యత్తుమ ఆటగాడిగా తీర్చిదిద్దాలి. రంజీ ట్రోఫీ స్థాయిలో క్రికెటర్లను అభివృద్ధి చేయాలి. అనంతరం వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం ఇవ్వండి. విజయ్ శంకర్, శివమ్ దూబే, వెంకటేష్ అయ్యర్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు అక్కడి నుంచి వచ్చిన వారే" అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment