టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్‌ను భారత మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. ఈ బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎల్‌వన్‌ను గంభీర్ అంచనా వేశాడు.
కాగా పాక్‌తో పోరుకు టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను గంభీర్ ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో దినేష్ కార్తీక్‌కు చోటు దక్క లేదు. ఇక తన అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు.
ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు గంభీర్ ఛాన్స్ ఇచ్చాడు. కాగా తన ప్రకటించిన జట్టులో ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను గంభీర్ ఎంచుకున్నాడు. తన జట్టులో స్ఫెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్‌ను కాదని యుజువేంద్ర చాహల్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్, షమీతో పాటుగా భువనేశ్వర్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరికే తుది జట్టులో జట్టు దక్కుతుందిని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
పాక్‌తో మ్యాచ్‌కు గౌతీ అంచనా వేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
టీ20 వరల్డ్‌కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment