టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్20) జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభంకు ముందు భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఆటగాళ్లు మెగా ఈవెంట్స్‌లో ఆడేటప్పుడు వ్యక్తిగత మైలురాళ్లపై దృష్టి పెట్టకూడదని, జట్టు గెలుపు కోసం మాత్రమే పోరాడాలని గంభీర్ తెలిపాడు. "ఎవరో ఒకరు జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలి. దానిని మిగితా ఆటగాళ్లు కొనసాగించాలి. అయితే ఆసియాకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి సెంచరీ సాధించాడు.
దీంతో విరాట్ ఓపెనర్‌గా రావాలని చర్చలు మొదలయ్యాయి. అంటే ఇన్నాళ్లూ ఓపెనర్‌లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందించిన అద్భుతమైన బాగస్వామ్యాలను మనం మరిచిపోయాం. ఇటువంటి అనవసర చర్చలతో రాహుల్ కీలక ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేయవద్దు.
నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ, కోహ్లి కంటే రాహుల్‌కే ఎక్కువ సత్తా ఉంది. రాహుల్ ఆటను ఇప్పటికే మనం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా చూశాం. అదే విధంగా ఏ ఈవెంట్‌లోనైనా ఆటగాళ్లు జట్టు విజయంపైనే మాత్రమే దృష్టి సారించాలి తప్ప.. వ్యక్తిగత రికార్డులు కోసం మాత్రం ఆలోచించకూడదని" గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment