పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాబర్ 'స్వార్థపరుడు' అంటూ గంభీర్ మండిపడ్డాడు. ఇక గంభీర్ చేసిన వాఖ్యలపై తాజాగా పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. ఆటగాళ్లపై విమర్శలు చేసే ముందు మనం ఏ మాట్లడాతున్నామో తెలుసుకోవాలని ఆ సూచించాడు.
సమా టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ.. "టోర్నీ అయ్యాక గంభీర్ గురించి ఏమి మాట్లాడాలో బాబర్‌కు చెబుతాను. ఎందుకంటే.. భారత్ కూడా టోర్నీ నుంచి ఇంటికి వెళ్లాల్సిందే కదా? గంభీర్ ఏమి అంత గొప్ప ఆటగాడు ఏమి కాదు. కాగా ఆటగాళ్లపై విమర్శలు చేయడం సహజం. కానీ వ్యక్తిగతంగా ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే వాఖ్యలు ఆటగాడిగా సలహాగా ఉండాలి కానీ, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు.
బాబర్ విషయానికి వస్తే.. తన కెరీర్‌లో ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు. అతడి లాంటి అద్భుతమైన ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. అతడు ఈ టోర్నీలో తన అంచనాలను అందుకోలేకపోయాడు. అంతమాత్రాన అతడిని మర్శించడం సరికాదు" అని అతడు పేర్కొన్నాడు.
ఇక బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ గురించి షాహిద్ మాట్లాడుతూ.. "టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టు అయినా ఇతర జట్టును కలవరపెడుతుంది. కానీ భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా జట్టుకు చాలా అనుభవం కూడా ఉంది. అయితే గతంలో బంగ్లాదేశ్ జట్టులో కూడా స్టార్ ఆటగాళ్లు ఉండేవారు. అయితే ప్రస్తుతం షకీబ్ కెప్టెన్సీలో అటువంటి ఆటగాళ్లు ఎవరూ కనిపించడంలేదు. షకీబ్ కూడా తన స్థాయికి తగ్గట్టూ రాణించడంలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయాకాశాలు భారత్‌కే ఎక్కువ ఉన్నాయి" అని అతడు తెలిపాడు.
చదవండి: పొట్టి క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..!
Comments
Please login to add a commentAdd a comment