జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.
కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం(జూలై 16) ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ జట్టు ఎంపికలో భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా పాల్గోనున్నట్లు సమాచారం. ఇక లంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 క్రికెట్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన రోహిత్, విరాట్, జడేజా.. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్‌లను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వినికిడి.
అదే విధంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు గంభీర్ రాకతో అతడి ఎంట్రీ సుగమైనట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అయ్యర్ సారథ్యం వహించగా.. గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment