లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కటక్ వేదికగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇండియా క్యాపిటల్స్ విజయ భేరి మోగించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి గంభీర్ సేన.. 17.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియా క్యాపిటల్స్ బ్యాటర్లలో హామిల్టన్ మసకద్జా మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 4సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో, మురళీధరన్, మూఫు తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన మణిపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మణిపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జెస్సీ రైడర్ (79), కైఫ్(67) పరుగులతో రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ప్లంకెట్, భాటియా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానంలో నిలిచింది.
చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. తొలి భారత కెప్టెన్‌గా
Comments
Please login to add a commentAdd a comment