
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు మరో వార్షికోత్సవం కనువిందు చెయ్యనుంది. ఆగస్టు 27 నుంచి వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంంది. ఎల్లుండి మాఢవీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నారు. మూడ్రోజుల పాటు(ఆగస్టు 29) వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది
కాగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.
నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ వసతి కోటాను 25న విడుదల చేయనుంది,
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది,. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది.