Special entry darshan
-
TTD: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…! నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఇప్పటికే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసేసింది. అయితే ఇవాళ(ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆగష్టు 27వ తేదీన తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 69,098 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
తిరుమల: నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు మరో వార్షికోత్సవం కనువిందు చెయ్యనుంది. ఆగస్టు 27 నుంచి వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంంది. ఎల్లుండి మాఢవీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నారు. మూడ్రోజుల పాటు(ఆగస్టు 29) వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది కాగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ వసతి కోటాను 25న విడుదల చేయనుంది, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది,. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది. -
Tirumala: మే, జూన్ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా.. ఈనెల 25న విడుదల
తిరుమల: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రాన్ని నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ మార్గాల్లో శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ వంటి పద్దతుల్లో దర్శనం కల్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మే, జూన్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీడీడీ అధికారిక వెబ్సైట్ ttps://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని కోరింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని తెలిపింది. ఇటీవల అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమార్కులు తిరుమల తిరుపతి దేవస్ధానం పేరుతో నకిలి వెబ్ సైట్‌ను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారని టీటీడీ తెలిపింది. నకిలీ వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు, భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్సైట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టిన్నట్లు తెలిపింది. దాదాపుగా 41 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి టిటిడి వాటి వివరాల సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. చదవండి: ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే -
తిరుమల: 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు ఖాళీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2 లక్షల 20వేల టిక్లెను అందుబాటులో ఉంచారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు సూచించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పురష్కరించుకొని పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. 44 నిమిషాల్లోనే.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో విడుదలైన 44 నిమిషాల్లోనే టికెట్లు అయిపోయాయి. 10 రోజులకు గానూ 2.20 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?) -
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల టికెట్లు ఎప్పుడంటే..
తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. చదవండి: (రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి) -
తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు
సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి 650 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్డ్ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సౌకర్యాన్ని కల్పించడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
నేడు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 30న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జనవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి, 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు, 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి, 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం,13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ, శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. -
24న తిరుమల వెళ్తున్నారా.. ఇది గమనించండి
సాక్షి, తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్భంగా జనవరి 24న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాలు.. చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, ఎన్నారైలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతారు. అందుకే తిరుమలలో రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉపబ్రహ్మోత్సవాలని వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. సమయం వాహనం ఉ. 5.30 - ఉ. 08.00 సూర్యప్రభ వాహనం ఉ. 9.00 - ఉ. 10.00 చిన్నశేష వాహనం ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం మ. 1.00 - మ. 2.00 హనుమంత వాహనం మ. 2.00 - మ. 3.00 చక్రస్నానం సా. 4.00 - సా. 5.00 కల్పవృక్ష వాహనం సా. 6.00 - సా. 7.00 సర్వభూపాల వాహనం రా. 8.00 - రా. 9.00 చంద్రప్రభ వాహనం -
శ్రీవారి ప్రత్యేక దర్శనానికీ ‘ఆధార్’ లింక్!
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేటాయించే రూ.300 ఆన్లైన్ టికెట్ల కేటాయింపునకు కూడా ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికులకు ప్రతినెలా మొదటి మంగళవారం ఐదువేల మందికి ప్రత్యేకంగా శ్రీవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. స్థానికులు వరుసగా మూడు నెలలు రాకుండా ఆధార్ నంబరును అనుసంధానం చేసి ఇప్పటికే అమలుచేస్తోంది. అదేవిధంగా ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపుల్లో మరింత పారదర్శకంగా ఉండాలని ఆధార్‌తో అనుసంధానం చేయాలని సంకల్పించిన విషయం విదితమే. అదే తరహాలో రూ.300 టికెట్లకు కూడా భవిష్యత్తులో ఆధార్ అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ పద్ధతిలో రూ.300 టికెట్లను ప్రభుత్వ గుర్తింపు కార్డుల ఆధారంగా టికెట్లు కేటాస్తున్నారు. భవిష్యత్‌లో రూ.300 టికెట్లకూ పోటీ పెరిగితే? ఒకసారి వచ్చిన భక్తుడికి నిర్ణీత సమయం పెట్టి నెలకోసారో, రెండు నెలల కోసారో తిరిగి టికెట్టు ఇచ్చేలా రేషన్ దర్శనం అమలుచేసే అవకాశం ఉంది.