![Tirumala Special Darshan Quota Tickets Will Be Released Today - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/30/ttd.jpg.webp?itok=_wMK198t)
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 30న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి, 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు, 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి, 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం,13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ, శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment