తిరుమల: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రాన్ని నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ మార్గాల్లో శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ వంటి పద్దతుల్లో దర్శనం కల్పిస్తుంది.
ఈ క్రమంలో తాజాగా మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మే, జూన్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీడీడీ అధికారిక వెబ్‌సైట్ ttps://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని కోరింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని తెలిపింది.
ఇటీవల అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమార్కులు తిరుమల తిరుపతి దేవస్ధానం పేరుతో నకిలి వెబ్ సైట్‌ను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారని టీటీడీ తెలిపింది. నకిలీ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు, భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్‌సైట్‌లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టిన్నట్లు తెలిపింది. దాదాపుగా 41 నకిలీ వెబ్ సైట్‌లను గుర్తించి టిటిడి వాటి వివరాల సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో పడింది.
చదవండి: ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment