సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్‌లో సోమవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు.
టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.
టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు.గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు.
చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు
వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలదిపారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు.
అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి మంగళవారం కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు. పిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని, దీనికి 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,స లహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు. హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment