Ttd budget
-
2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం.. కీలక నిర్ణయాలివే
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్లో సోమవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు.గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలదిపారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు. అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి మంగళవారం కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు. పిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని, దీనికి 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,స లహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు. హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
రూ.4,411.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24కి) తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రూ.4,411.68 కోట్ల బడ్జెట్‌ను ఫిబ్రవరి 15న జరిగిన పాలకమండలి సమావేశం ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అప్పుడు ఈ వివరాలు వెల్లడించలేదని తెలిపారు. తిరుమలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ప్రజలంతా, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గతనెలలో జరిగిన పాలకమండలి సమావేశంలో కొన్ని పాలనపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు.. ♦ వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. ♦ కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1,200 కోట్ల కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. ♦ భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్లో జారీచేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తిచేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ♦ అలిపిరి నుంచి వకుళమాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం. ♦ ఏప్రిల్ 5వ తేదీన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పి స్తారు. ♦ వేసవిలో మూడునెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల సిఫారసులు బాగా తగ్గించాలని కోరుతున్నాం. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం. ♦ తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.5.25 కోట్లు మంజూరు చేశాం. ♦తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల పడమర వైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునికీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ.4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం. ♦ శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.990 కోట్లకు వడ్డీ ఆదాయం టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా పెద్ద ఎత్తున వడ్డీ ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం మరో రూ.177 కోట్లు పెరిగి మొత్తం రూ.990 కోట్లు వస్తాయని పేర్కొంది. హుండీ ద్వారా రూ.1,591 కోట్ల రాబడి అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,591 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో టీటీడీ అంచనా వేసింది. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్ రూ.1,315.28 కోట్ల మేర పెరిగింది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పందసేవ సిబ్బంది జీతాలకు రూ.1,532 కోట్లు వెచ్చించనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.690.50 కోట్లు కేటాయించారు. కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నిల్వ రూ.291.85 కోట్లుగా అంచనా వేశారు. ఇటీవల కొన్ని వసతి గదులు, కల్యాణమండపాల అద్దె పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వీటిద్వారా ప్రస్తుత సంవత్సరం రూ.118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. -
వార్షిక బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ.. ఎంతంటే?
సాక్షి, తిరుమల: 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల రూపాయలు అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 15వ తేదీన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి, భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయింపు గానూ పాలక మండలి ఆమోదం తెలిపిందని, అంతే కాకుండా తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నామని, కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసే వారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. విఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తాంమని, త్వరలోనే బాలాజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడించారు. చదవండి: తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో.. -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ వివరాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ పద్మావతి హృదయాలయంకు అవసరమైన వైద్య పరికరాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని పాలకమండలి ఏర్పాటు చేసిందన్నారు. పద్మావతి హృదయాలయం ప్రారంభించి 100 రోజులలో 100 అపరేషన్లు నిర్వహించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్‌కు కంప్యూటర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంను బాలాజి జిల్లా కలెక్టరెట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి నిబంధనల మేరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో స్టీమ్ ద్వారా అన్నప్రసాదాల తయారు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ గ్యాస్, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ తయారీకి 4 రూపాయల 71 పైసలు ఖర్చు చేస్తోంది. ఎన్‌ఈడీసీఏపీ వారు సోలార్ సిస్టమ్ ఆర్ఈఎస్సీవో మోడల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయల 54 పైసలతో 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా టీటీడీకి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమలలో రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేసింది పాలకమండలి. ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు మంజూరు చేయాలని టీటీడీ అధికారులకు ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని ,ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేస్తారని చైర్మన్ తెలిపారు. తిరుమల నాదనీరాజన మండపం షెడ్డు స్థానంలో శాశ్వత మండపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించింది పాలకమండలి. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని చైర్మన్ పేర్కొన్నారు. రూ.3.60 కోట్లతో టీటీడీ ఆయుర్వేద ఫార్మశీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. శ్రీవారి ఆలయ మహద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. గోపురాల బంగారు తాపడం విషయంపై ఆగమ పండితులతో చర్చించి క్రేన్ సహయంతో తాపడం పనులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం జారీచేసారు చైర్మన్. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు మీడియాలో జరిగిన ప్రచారం ఆవాస్తవమని, ధర పెంచే ఆలోచన మా పాలకమండలికు లేదని స్పష్టం చేశారు. -
శ్రీపతికి సిరుల పంట
రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు పెరుగుతున్న టీటీడీ బడ్జెట్..హుండీ కానుకలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ.వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్లో రూ.905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ.1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ.590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదా యం అప్పట్లో రూ.227 కోట్లు ఉండగా ప్రస్తు తం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరి గింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ.50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి పదిహేను రెట్లు పెరిగి రూ.778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు. రూ.1.34 లక్షలతో మొదలై... 1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో హుండీ ద్వారా నెలకు రూ.80 కోట్లు లభిస్తుం డగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ.60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభిస్తుండ టం పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఈ నెలల్లో ఆదా య పన్ను పద్దులు చూపిం చే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారముంది. రూ.12వేల కోట్లపైనే డిపాజిట్లు 2016-2017సంవత్సరానికిగాను రూ. 2678 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఇందులో డిపాజిట్లపై వడ్డీ సుమారు రూ.778.93 కోట్ల రావచ్చని టీటీడీ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అంటే.. పెట్టుబడులపై తొమ్మిది శాతం వడ్డీ లెక్కిస్తే శ్రీవారి నికర డిపాజిట్లు సుమారుగా రూ.12వేల కోట్ల పైమాటే. పెట్టుబడులపై వచ్చే వడ్డీని టీటీడీ విని యోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలోనే తిరి గి డిపాజిట్ల కింద జమ చేసేస్తుండటంతో నిధులు బాగా పెరుగుతున్నాయి.