
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి.శుక్రవారం 56,950 మంది స్వామివారిని దర్శించుకోగా 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment