
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.
మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(మంగళవారం) 71,409 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్లుగా లెక్క తేలింది.
Comments
Please login to add a commentAdd a comment