
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,256 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,087 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు.
అలాగే, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.
ఇదిలా ఉంటే.. అక్టోబర్‌నెలా కోటా టికెట్లను జులై 18వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
Comments
Please login to add a commentAdd a comment