టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి | Ambati Rambabu Slams Chandrababu Over Tirupati Laddu Issue | Sakshi
Sakshi News home page

టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి

Published Tue, Sep 24 2024 2:23 PM | Last Updated on Tue, Sep 24 2024 3:13 PM

Ambati Rambabu Slams Chandrababu Over Tirupati Laddu Issue

సాక్షి, గుంటూరు: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేశారనిస్పష్టమైపోయిందన్నారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు.

ఈ మేరకు గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.

‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్‌ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారు. హిందూ సంప్రదాయల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’ అని మండిపడ్డారు.

సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement