బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల | Sajjala ramakrishna Reddy Comments Chandrababu Over Laddu issue | Sakshi
Sakshi News home page

బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల

Published Sat, Sep 28 2024 5:50 PM | Last Updated on Sat, Sep 28 2024 8:37 PM

Sajjala ramakrishna Reddy Comments Chandrababu Over Laddu issue

సాక్షి,  హైదరాబాద్‌: శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్టును లీక్‌ చేశారని మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.

అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని తెలిపారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని  తెలిపారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని తెలిపారు. 

తిరుమల లడ్డూ విషయంలో చంద్ర బాబు ఘోరమైన అబద్ధం ఆడారు. బాబు అన్నట్టుగా జంతువుల కొవ్వు మాట షోకాజ్ నోటీసులో లేవు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, బుడమేరు బాధితుల అంశాలు పక్కన పెట్టి.. ఇప్పుడు టీడీడీ లడ్డూను తెరపైకి తీసుకువచ్చారు . చలో తిరుపతి అని వైయస్ జగన్ ఏమైనా పిలుపు ఇచ్చారా? ఇష్యూ చేసింది టీడీపీ, ఉద్రిక్తత సృషించారు

‘జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల  పర్యటనకు అనుమతి లేదని మా నేతలకు ఇచ్చిన నోటీసులలో ఉంది. డిక్లరేషన్ అంశం భక్తుడు, టీటీడీకి సంబంధించిన అంశం. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు  పాప పరిహారం చేసుకోవాలి. జగన్ హుందాగా వ్యవహరించారు. 

మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికే పలు మార్లు జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఎప్పుడు లేని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్ తిరుమలకు వెళతా అంటే కట్టలు కట్టుకుని వచ్చి రాజకీయం చేశారు’ అని మండిపడ్డారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement