పవన్‌ అసలు రంగు బట్టబయలైంది | Celebrities and politicians reactions on supreme court Comments Laddu Issue | Sakshi
Sakshi News home page

పవన్‌ అసలు రంగు బట్టబయలైంది

Published Tue, Oct 1 2024 8:29 PM | Last Updated on Tue, Oct 1 2024 9:28 PM

Celebrities and politicians reactions on supreme court Comments Laddu Issue

ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్‌ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్‌ ఆస్కింగ్‌.
    – ప్రకాశ్‌రాజ్, ప్రముఖ నటుడు

 సుప్రీంకోర్టు  చంద్రబాబు చెంపలు వాయించింది 

తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది 
– సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ 

బాబు, పవన్‌ రాజీనామా చేయాలి
చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి.  
-పీవీఎస్‌ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి

భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం 
తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం. నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! 
– ధన్య రాజేంద్రన్‌ (ది న్యూస్‌ మినిట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌)

 

 దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి 
కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి 
    – పూనమ్‌కౌర్, నటి  

బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది 
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది.     
– గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత  

బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు 
తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్‌’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు 
సరిగ్గా అదే చెప్పింది. 
– శ్రీధర్‌ రామస్వామి, ఏఐసీసీ సోషల్‌ మీడియా నేషనల్‌ కో–ఆర్డినేటర్‌

 పవన్‌ అసలు రంగు బట్టబయలైంది 
తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి 
 – వీణా జైన్‌ (సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌)

 

దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? 
ప్రత్యర్థులను టార్గెట్‌  చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా 
స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? 
– ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ రాజ్యసభ

బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! 
చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! 
– సుమంత్‌ రామన్, రాజకీయ విశ్లేషకులు

 

హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు
రాజకీయ ప్రయోజనాల కోసం 
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్‌ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాల
నుకుంటే అది పొరపాటే. 
– డాక్టర్‌ గిరిజా షేట్కార్, యూనివర్సల్‌ హెల్త్‌ రైట్స్‌ అడ్వొకేట్‌

ఇప్పుడేం చేస్తారు మీరందరూ 
అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్‌ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్‌ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను.    
 – వీణావాణి, వేణు స్వామి భార్య

వైఎస్‌ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం 
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు.     
– హర్ష్‌ తివారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement