చెల్లెలి కోసం చేనేత బహుమతులు | Varun Dhawan sent handmade gift hangers to his sisters on Rakhi | Sakshi
Sakshi News home page

చెల్లెలి కోసం చేనేత బహుమతులు

Published Mon, Aug 27 2018 5:53 AM | Last Updated on Mon, Aug 27 2018 5:53 AM

Varun Dhawan sent handmade gift hangers to his sisters on Rakhi - Sakshi

వరుణ్‌ ధావన్‌

‘‘ఏదోటి కొనిచ్చే దానికంటే మన సమయాన్ని వెచ్చించి మన వాళ్లకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్‌  చేసి ఇచ్చిన బహుమతుల్లో ప్రేమ ఎక్కువుంటుంది అనే విషయాన్ని నమ్ముతాను’’ అంటున్నారు వరుణ్‌ ధావన్‌. రక్షా బంధన్‌ సందర్భంగా ప్రతి సంవత్సరం తన చెల్లెలకు ఏదో బహుమతి ప్రెజెంట్‌ చేయడం వరుణ్‌కు అలవాటట. ఈ సంవత్సరం తనే కొన్ని చేనేత చీరలు, దుప్పట్టాలు, డైరీలు.. ఇలా అన్నీ చేత్తో చేసిన సామాన్లను స్వయంగా సెలెక్ట్‌ చేసి, గిఫ్ట్‌గా బహూకరించదలిచారట. ‘‘ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా చెల్లెలకు గుర్తుండిపోయే గిఫ్ట్స్‌ ఇవ్వడం చాలా ఇష్టం. ‘సూయి ధాగా’ సినిమా చేస్తున్నప్పుడు మేడ్‌ ఇన్‌ ఇండియా ప్రాడక్ట్స్‌ గురించి తెలుసుకున్నాను. వాటినే గిఫ్ట్‌గా ఇవ్వదలిచాను. నా చెల్లికి నచ్చుతాయనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement