chenetha
-
పోచంపల్లిలో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
-
ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాలను ఎత్తిపోసే పనిలో టీఆర్ఎస్ ఉంటే.. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే పని లో ఉందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటివి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా అంగీకరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో దూతలను కోన్‌కిస్కా గాళ్లు అంటూ మాట్లాడిన బీజేపీ.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జీఎస్టీ విధింపునకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందంటూ బీజేపీ నేతలు పచ్చి అబ ద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తమ కు సంబంధం లేదనే ఆధారాలను మీడియాకు అందజేశారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నకిలీ మాటలతో వెకిలి చేష్టలు చేస్తున్నారు, వారిస్థాయి ఏమిటో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ దూతలే చెప్పారు. చండూరులో టీఆర్ఎస్ సభ విజయవంతమవడంతో బీజేపీ నాయకుల కు కంటి మీద కునుకులేకుండా పోయింది..’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీజేపీ డీఎన్ఏలోనే అబద్ధాలు: బీజేపీ డీఎన్ఏలోనే పచ్చి అబద్ధాలు ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్లో ఇతర పార్టీల విలీనాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ.. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరుల విషయంలో చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 65లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంలో రూ.30వేల కోట్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక శాఖకు కేంద్రం లేఖ రాసినా సీఎం కేసీఆర్ తిరస్కరించారని చెప్పారు. చేనేతపై జీఎస్టీని మినహాయించాలని 2017లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరఫున నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. మిషన్ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. ఫ్లోరైడ్ నిర్మూలనకు రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మిషన్ భగీరథకు రూ.2,350 కోట్లు ఇవ్వాల్సి ఉందని హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి 20 ఉత్తరాలు రాసినా స్పందన లేదని, మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలే! బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్లో బ్రిడ్జి కూలితే ప్రభుత్వ పతనానికి సంకేతం అంటూ మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇప్పుడు అదే విషయాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు. ప్రజల ప్రాణాలు నీళ్ల పాలు అన్నట్టుగా తయారైంది. సంక్షేమానికి టీఆర్ఎస్.. సంక్షోభానికి బీజేపీ నిర్వచనంగా మారాయి. మునుగోడు ఎన్నికలో ప్రజలు పాలు, నీళ్లకు తేడాను గుర్తించి ప్రజాస్వామ్య విలువలు పెంచేలా తీర్పునిస్తారన్న నమ్మకం ఉంది’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. హామీలను నిలబెట్టుకోలేకే మునుగోడులో జేపీ నడ్డా సభను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘మునుగోడు’ ముంగిటకు సర్కార్‌ను తెచ్చాం -
Nethanna Nestham Scheme: నేతన్నలకు భరోసా!
చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి సోమవారం అధికారులంతా నేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చి చేనేతకు చేయూతనిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ వీవర్స్ థ్రిప్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ (టీఎఫ్ఎస్ఎస్)ను 2017లో ప్రవేశపెట్టింది. అలాగే నేత కార్మికులకు పొదుపు పథకాలనూ అమలు చేస్తోంది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులందరినీ ‘త్రిఫ్ట్’ పథకంలో చేర్పించాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించింది. గతంలో రూ. 12 కోట్లతో ప్రారం భించిన ఈ పథకానికి ఈ ఏడాది రూ. 30 కోట్లు విడుదల చేయించారు. కార్మికుడిని యజమానిని చేయాలన్న ఉద్దేశంతో ‘వర్కర్ టూ ఓనర్’ పథ కాన్ని ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల తయారీకి ఇప్పటి వరకు రూ. 2,000 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చింది. చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం సంపాదిస్తున్న కార్మికులకు పొదుపు (త్రిప్టు) పథకాన్ని ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నది. లాక్డౌన్ నేప థ్యంలో పరిశ్రమలు బంద్ అయ్యాయి. ఫలితంగా కార్మి కులు ఉపాధి కోల్పోయారు. కార్మికులు జమ చేసిన నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు మూడేండ్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకే తిరిగి చెల్లించి వారి కుటుం బాలకు చేయూత నిచ్చింది. ఈ పథకం ఈ ఏడాది నుంచి పునః ప్రారంభిస్తున్నందున కార్మికులు చేరేందుకు ఆసక్తి చూపు తున్నారు. దేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆగస్టు 7న నుంచి రైతు బీమా తరహాలో ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కోసం 50 కోట్లు కేటాయించి... ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసింది. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) 60 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన సుమారు 80 వేల మంది కార్మికులకు ‘నేతన్న బీమా’ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యా చరణ మొద లెట్టినారు. ఈ నేపథ్యంలో బీమా కాలంలో లబ్ధిదారులైన... చేనేత, మర మగ్గాల కార్మికులు ప్రమాద వశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగ వైకల్యం కలిగినా... కుటుంబానికి ఆర్థిక భరోసాగా 10 రోజుల్లో నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఇలా నేతన్నలకు చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సేవలు అభినందనీయం. ‘ఇంటింటికీ త్రివర్ణ పతాకం’ కార్యక్రమం కోసం 33 లక్షల మీటర్ల నేత వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేయటం నేతన్నలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోంది. – డాక్టర్ సంగని మల్లేశ్వర్ కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి -
మగ్గం.. చిద్విలాసం.. కష్టకాలంలో ఆదుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెడనకు చెందిన వి.అక్కనాగమ్మ టీడీపీ మాజీ కౌన్సిలర్. చేనేత మగ్గం పనితో కుటుంబానికి బాసటగా నిలుస్తోంది. సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్ జగన్ అన్నట్టుగానే టీడీపీకి చెందిన ఆమెకు కూడా ఏడాదికి రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం అందించారు. గత మూడేళ్లలో వచ్చిన రూ.72 వేలతో.. గతంలో చేసిన అప్పులు తీర్చడంతోపాటు చేనేతకు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేసింది. ఇలా ఒక్క అక్కనాగమ్మ మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున 85 వేలకు పైగా చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం నేతన్న నేస్తం అందిస్తోంది. ఫలితంగా చేనేత రంగం సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. నేత కార్మికులు నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. నేత కార్మికులకు భరోసా ఇలా.. ► నేతన్న నేస్తంతోపాటు నవరత్నాల పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి ఊపిరి పోశాయి. ఈ మూడేళ్లలో దాదాపు రూ.576.05 కోట్లు నేతన్న నేస్తం కింద పంపిణీ చేశారు. ► కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ఆప్కో ద్వారా సేకరించి విక్రయించారు. చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► మూడేళ్లలో దాదాపు 40 ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్డులు, తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వ్రస్తాలకు దీటుగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తూ.. ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ► రెడీమేడ్ వ్రస్తాలను కూడా తయారు చేయడంతో చేనేత డిజైన్లకు ఆదరణ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లోనూ, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోనూ వీటిని విక్రయిస్తున్నారు. రాజకీయంగానూ అందలం చంద్రబాబు మోసం చేస్తే, జగన్ చేనేతలను ఆదుకున్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కారి్మకుడికి అండగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కారి్మకుల కుటుంబాలకు రూ.3.52 కోట్లు చెల్లించారు. ఇద్దరికి ఎమ్మెల్సీ, ఒకరికి ఎంపీ, ఏడుగురికి మున్సిపల్ చైర్మన్లు, ఇద్దరికి టీటీడీ బోర్డు మెంబర్.. పద్మశాలి, తొగట, దేవాంగ, కరి్ణశాలి కార్పొరేషన్ చైర్మన్లు, 48 మందికి డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఎంతోమందికి అవకాశమిచ్చారు. – మోహనరావు, ఆప్కో చైర్మన్ చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు -
రైతుబంధు పథకం తరహాలో త్వరలో చేనేతబంధు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించే అవకాశమున్నట్లు సమాచారం. తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ (టీ–టాప్)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకార రంగంతోపాటు సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ‘నేతన్నకు చేయూత’... జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘నేతన్నకు చేయూత’పథకాన్ని శనివారం తిరిగి ప్రారంభించనున్నారు. నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను జోడించనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది. -
బీమాతో ధీమా, ఆశలు రేకెత్తిస్తోన్న సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రైతు బీమా తరహాలో రూ.5 లక్షలతో ‘చేనేత బీమా’అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిరిసిల్లలో చేసిన ప్రకటన.. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు, వారి కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ కొత్త పథకం మార్గదర్శకాలపై వారిలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలపై ఆధారపడి సహకార రంగంతో పాటు సహకారేతర రంగంలోనూ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర చేనేత విభాగం పథకం మార్గదర్శకాలపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘చేనేత మిత్ర’, ‘నేతన్నకు చేయూత’తరహాలో.. కొత్తగా ప్రవేశపెట్టే ‘చేనేత బీమా’పథకాన్ని సహకారేతర రంగంలో ఉన్న వారికి కూడా వర్తింప చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రైతుబీమా పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు ప్రమాదం, అనారోగ్యం, ఆత్మహత్యలు ఇలా..ఏ కారణంతో చనిపోయినా వర్తింపజేస్తున్నారు. అయితే చేనేత బీమా పథకాన్ని ఏ వయసు వారికి వర్తింపజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు, ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. వలస కార్మికులకూ వర్తింపజేయాలి రాష్ట్రంలో 615 చేనేత సహకార సంఘాలు ఉండగా, చేనేత దాని అనుబంధ రంగాల్లో సుమారు 40 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. మరమగ్గాల కార్మికులను కూడా కలిపితే వీరి సంఖ్య 70 వేలకు పైనే ఉంటుందని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం అధికారులు చెబుతున్నారు. అయితే నేత రంగంలో ఉపాధి లేక ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లినవారు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే లక్షన్నర వరకు నేత కార్మికులు ఉంటారని నేత కార్మిక సంఘాలు చెప్తున్నారు. చదవండి: వాట్సాప్ మరో ఫీచర్, పాస్ వర్డ్ మరిచిపోతే అంతే సంగతులు గతంలో గొర్రెల పంపిణీ యూనిట్ల పంపిణీ సందర్భంగా క్షేత్ర స్థాయిలో గొర్రెల కాపరులతో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయడం, సహకార సంఘాల బయట ఉన్న వారికి సభ్యత్వం ఇవ్వడం తదితరాలను ప్రభుత్వం చేపట్టింది. అలాగే చేనేత బీమా పథకం అమలుకు ముందు కూడా అందరినీ సహకార రంగం పరిధిలోకి తెచ్చేలా సభ్యత్వం ఇవ్వాలని నేత కార్మిక సంఘాలు కోరుతున్నాయి. స్థానికంగా ఉపాధి లేక సూరత్, ముంబయి, షోలాపూర్, భివాండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన నేత కార్మికులకు కూడా బీమా వర్తింప చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. జీవనజ్యోతి, సురక్ష పునరుద్దరణ? గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’, ‘ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన’పథకాల అమలుతో నేత కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. అయితే రెండేళ్లుగా ఈ పథకాల అమలు నిలిచిపోవడం, వీరికి మరే జీవిత బీమా పథకాలు లేకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ చేనేత బీమా పథకంతో పాటు కేంద్ర పథకాలు కూడా తిరిగి అమల్లోకి వస్తే నేత కార్మికుల కుటుంబాలకు బాగా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా అమలు చేయాలి నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలి. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా రాష్ట్రం ఏర్పడింది మొదలు ఇప్పటివరకు 360 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బాధిత కుటుంబాలన్నిటికీ రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి. పదిరోజుల్లోగా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న చేనేత బీమా పథకం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తాం. ప్రస్తుతం 40 వేలకు పైగా కార్మికులు చేనేత రంగంలో, మరో 30 వేలకు పైగా పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ పథకం ద్వారా వీలైనంత మందికి లబ్ధి జరిగేలా మార్గదర్శకాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం. సంబంధిత రంగానికి చెందిన కార్మికులు, ఇతరుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. – శైలజా రామయ్యర్, కమిషనర్, చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కు చెందిన పిస్క పోశెట్టి (57) చేనేత కార్మికుడు. ఇతని భార్య కనకవ్వ పవర్లూమ్ కార్మికులకు భోజనం పెడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే కరోనా, ఇతర కారణాల నేపథ్యంలో ఇద్దరికీ ఆదాయం లేక ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యింది. ఈ పరిస్థితుల్లోనే ఈ ఏడాది ఏప్రిల్ 10న పోశెట్టి కొత్త చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్తను కోల్పోయిన కనకవ్వ ప్రస్తుతం తన కుమారునితో కలిసి కిరాయి ఇంట్లో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో నివాసముండే బిట్ల చంద్రమౌళి (51)కూడా నేత కార్మికుడే. దివ్యాంగుడైన ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉండగా.. కూతురు పెళ్ళికి రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. మరోవైపు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రమౌళి ఇటీవల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని భార్య ప్రస్తుతం బీడీలు చుడుతూ కుటుంబాన్ని నడిపేందుకు నానా అవస్థలూ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి చేనేత బీమా ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. -
అ‘ద్వితీయం’గా దూసుకుపోతున్న చీరాల
సాక్షి, చీరాల (ప్రకాశం): జిల్లా పరిధిలోని చీరాల పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది చేనేత రంగం. అలాగే వస్త్ర రంగంలో చినబొంబాయిగా పేరొందిన చీరాలలో ఎందరో ఉద్దండులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చరిత్రలో నిలిచారు. రాజకీయంగా చీరాల నియోజకవర్గం 1951 నుంచి ఏర్పడినప్పటికి అభివృద్ధికి దూరంగా ఉండేది. ముఖ్యంగా అగ్గిపెట్టలాంటి రోడ్లు, అధ్వాన పారిశుద్ధ్యం, అస్తవ్యస్త డ్రైనేజితో పాటు పేదలకు సొంత ఇల్లు నిర్మాణం కలగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా పనిచేశారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆమంచిని అభివృద్ధిలో వేలెత్తి చూపని స్థాయికి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలను తెరపైకి తెస్తూ ఎన్నికల అనంతరం మాత్రం అందరినీ సమానంగానే చూస్తూ వారికి కావాల్సిన ప్రజా అవసరాలను తీర్చడం ఆమంచికి బాగా కలిసొచ్చిన అంశం. మున్సిపాలిటీలో అయితే వార్డులను, పంచాయతీ అయితే గ్రామాలకు నిధులు కేటాయించి సరికొత్త రాజకీయాలకు ఆమంచి తెరలేపారు. వ్యాపారులకు అండగా.. చీరాలలో సుదీర్ఘకాల సమస్యగా ఉన్న నెహ్రూ కూరగాయల మార్కెట్‌ను సైతం వందరోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్‌ను అందుబాటులో తెచ్చారు. ఈపూరుపాలెం కూరగాయల మార్కెట్‌ను, వేటపాలెం కూరగాయల, చేపల మార్కెట్‌ను సుందరంగా ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లను విస్తరింపచేయడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్ట్రీట్ వెండర్స్ (తోపుడు బండ్లు) జోన్ల ఏర్పాటు చేశారు. దీంతో కొంత ట్రాఫిక్ నియంత్రణతో పాటు, తోపుడుబండ్లు వ్యాపారులకు ఒక పరిష్కారం చూపించారు. ఇరుకుగా ఉండే చీరాల నుంచి వేటపాలెం ప్రధాన రహదారిని ఇరువైపులా విస్తరింపచేసి ప్రమాదాలు జరగకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు అతి తక్కువ ఖర్చుతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. పేదవాని కలకు సాకార దిశగా.. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ఆమంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా సుమారు 10 వేల ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. స్థలాల కేటాయింపుల్లో పేదరికమే ప్రాతిపదికన అర్హులైన వారికి పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా కేటాయించారు. వాటిలో ముఖ్యంగా కొణిజేటి చేనేతపురి, దత్తక్షేత్రం, అబ్దుల్ కలాం కాలనీ, వివేకానంద కాలనీల వంటి సముదాయాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రజల ఆకాంక్షకు బాసటగా.. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు ఉన్న తీర ప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. తద్వారా మత్య్సకార గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చడంతో పాటు పర్యాటకంగా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులు వేశారు. చీరాల ప్రాంతంలో అత్యధికంగా యువకులు ఆటోలు నమ్ముకుని జీవనాన్ని సాగిస్తుంటారు. వారందరికి ఆమంచి గతంలో వంద ఆటోలు ఇప్పించి ఆటోడ్రైవర్లను ఓనర్లుగా మార్చారు. చేనేతలకు సైతం చీరాల పుట్టినిల్లు కావడంతో చీరాలకు ఏడీ కార్యాలయం కావాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏడీ కార్యాలయాన్ని చీరాలకు మార్పించారు. అలానే పట్టణంలోని నడిబొడ్డున ఉన్న అతివిలువైన స్థలాన్ని దళితులకు కలగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆమంచి దళితుల పక్షపాతి అని రుజువు చేసుకున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ముస్లింల కోసం సుమారు రూ.2కోట్లు వెచ్చించి షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేసి ముస్లింల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్యనందించేందుకు గాను కొత్తపేటలో 45రోజుల్లోనే అన్ని సౌకర్యాలతో జిల్లా పరిషత్ పాఠశాలను నిర్మించారు.ఆ పాఠశాలలో గడచిన విద్యాసంవత్సరంలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే ఆ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పవచ్చు. ఆమంచి చొరవతో గడచిన విద్యాసంవత్సరంలో 5 వేలకు పైచిలుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందుకు ఆమంచి ఆయా ప్రభుత్వ పాఠశాలలపై వసతులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం కేటాయించడం, ప్రతిని«త్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, చిన్నపాటి ప్రజాసమస్యను సైతం అధికారులతో మాట్లాడి వెంటనే ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆమంచిపై ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకగా మారడంతో పాటు ఆమంచిపై నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఉంది. మౌలిక వసతులు.. చీరాల నియోజకవర్గం అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది జనాభా నివాసముండే ప్రాంతం. ముఖ్యంగా చీరాలలో వ్యాపారాల అవసరాలకు వచ్చేవారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీరందరికీ అనుగుణంగా చీరాల పట్టణాన్ని ఆమంచి అన్ని సౌకర్యాలతో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. మరిముఖ్యంగా నియోజకవర్గంలోని మురుగునీటి కాల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, మంచి సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చీరాల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశం మొత్తంలోనే చీరాలకు 11వ స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. దీనికి తోడు సుదీర్ఘకాలంగా సమస్యగా ఉన్న సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను ముందు చూపుతో వేటపాలెం మండలంలోని రామాపురంలో అత్యంత వ్యవప్రయాసలతో ఏర్పాటు చేశారు. చీరాల ప్రజలు కోరుకునేది ఇవే... చేనేతలకు టెక్స్టైల్స్ పార్కు చేయాల్సి ఉంది. నియోజకవర్గంలోని ప్రధానంగా ఉన్న కొన్ని రోడ్లు విస్తరించాల్సి ఉంది. పట్టణంలోని మౌలిక వసతులపై ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. -
ఫ్యాక్షన్ పోకడలకు జీవం..ధర్మవరం
సీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ధర్మవరం. రాజకీయం అండతో ఇక్కడ విచ్చు కత్తులు స్వైరవిహారం చేశాయి. పచ్చ చొక్కాల అధికార దాహానికి రక్తపుటేరులు తక్కువ పడ్డాయి. ఎగిసి పడ్డ బాంబులు.. తుపాకుల మోతలు.. తెగిపడ్డ కుత్తుకల హాహాకారాలతో ధర్మవరం నియోజకవర్గంలో నాడు అధర్మమే రాజ్యమేలింది. వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకుని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తొలిదశలో ధర్మవరం నియోజకవర్గంలో అరాచకాలు పెచ్చుమీరాయి. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ పాగా వేసేందుకు ఆర్వోసీ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెడుతూ వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరంలో శాంతి బీజాలు పడ్డాయి. ఫ్యాక్షన్ ప్రభావం పూర్తిగా కనుమరుగైన సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పరిస్థితిని పూర్వపు స్థితికి కంటే మరింత దిగజార్చింది. జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా రాజకీయ చరిత్ర పుటల్లో ధర్మవరం చేరిపోయింది. సాక్షి, ధర్మవరం: ధర్మవరం పేరు వినగానే మొదట గుర్తొచ్చేది చేనేత రంగం. శ్రమజీవుల కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో చేనేతకు ఇక్కడి నేత కార్మికులు గుర్తింపు తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయం, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 1955 నుంచి జనరల్ కేటగిరి కింద ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుఫున పప్పూరు రామాచారి గెలుపొందారు. మొత్తం 13 దఫాలు జరిగిన ఎన్నికల్లో గరుడమ్మగారి నాగిరెడ్డి వరుసగా మూడుసార్లు (1983, 1985, 1989) ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఇందులో తొలిసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అత్యంత జనాదరణ పొందిన నేతగా నాగిరెడ్డికి పేరుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వైఖరితో విసుగు చెందిన సొంత పార్టీలోనే విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది సీనియర్లు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. చేనేతలను ఆదుకోవడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలం కావడంతో ఆ వర్గం టీడీపీపై పూర్తి అసంతృప్తితో ఉంది. ఈ రెండేళ్లలో అధికారపార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఎమ్మెల్యే సూరి ఒంటెద్దు పోకడ నచ్చక చాలా మంది వైఎస్సార్ సీపీలో చేరారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉండిపోయారు. సంక్షేమం దూరం చేనేతలకు అందుతున్న అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ పథకం, చేనేత ఆరోగ్య బీమా పథకాలు కార్మికులకు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు టీడీపీ నాయకులకు కమీషన్లు ముట్టజెప్పనిదే ఏ పనీ జరగడం లేదు. సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సూరి తన గుప్పిట్లోకి తీసుకుని కమీషన్ల పైరవీలో జోరుగు నడిపించారు. ఆయన వైఖరి కారణంగా రియల్ వ్యాపారం కుదేలైంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వారి భూములను 08 ఖాతాలోకి చేర్పిస్తూ సామాన్యులతో పాటు రియల్టర్లనూ ఇబ్బంది పెట్టారు. గ్రామాల్లో అర్హత లేకపోయినా.. టీడీపీ అనే ముద్ర ఉంటే చాలు సంక్షేమ పథకాలను కట్టబెడుతూ వచ్చారు. శ్రమజీవుల కేంద్రంగా.. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3లక్షల జనాభా ఉండగా, 2,23,007 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,11,980, మహిళలు 1,11,001 ఉన్నారు. చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం శ్రమ జీవుల కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇంటికో మగ్గం చొప్పున వీధివీధిలో మగ్గం చప్పుళ్లు నిత్యమూ వినిపించేవి. ప్రపంచీకరణ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో నేతన్నలు కుదేలయ్యారు. ముడిసరుకు ధరలు అమాంతం పెరిగి గిట్టుబాటు ధర లభ్యం కాక అప్పుల ఊబిలో చేనేతలు కూరుకుపోయారు. నేతన్నలను ఆదుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల నిరాదరణ కారణంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాన సమస్యలివే.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని దాదాపు 80 శాతం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 చెరువులు ఉన్నాయి. అయితే ఒక్క ధర్మవరం చెరువుకు తప్ప మిగిలిన చెరువులకు సాగునీరు ఇవ్వలేకపోయారు. ధర్మవరం పట్టణంలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రోజూ 300 నుంచి 500 వరకు ఓపీ నడుస్తూ ఉంటుంది. ధర్మవరం మున్సిపాలిటీతోపాటు, ధర్మవరం మండలం, బత్తలపల్లి ప్రజలు ఇక్కడికి చికిత్సల కోసం వస్తుంటారు. అత్యవసర వైద్య సేవలకు అనంతపురం తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మౌలిక వసతులూ కరువయ్యాయి. తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని ముంపు గ్రామాల నిర్వాసితులకు నేటికీ పరిహారం సక్రమంగా అందలేదు. ధర్మవరం పట్టణంలో అత్యధికంగా ఉన్న చేనేతలు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు. శాంతి కుసుమాలు పూయించిన కేతిరెడ్డి 2009లో వైఎస్సార్ నేతృత్వంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో శాంతి కుసుమాలు పూయించేందుకు కేతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చరిత్ర పుటలు తిరగేస్తే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అనే పదాలు వినపడుతుంటాయి. అదే తరహాలో కేతిరెడ్డికి ముందు.. కేతిరెడ్డి తర్వాత అంటూ గొప్పగా చెప్పుకునేలా ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. కేతిరెడ్డి హయంలో ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కింది. చిత్రావతి నది నుంచి ధర్మవరానికి తాగునీటిని అందించారు. నియోజకవర్గంలోని 80 శాతం గ్రామాలకు రోడ్లు వేయించారు. చేనేతల ఇబ్బందులు తీర్చేందుకు ముడిపట్టు రాయితీ పథకాన్ని తీసుకువచ్చారు. ముడిపట్టు ధరలు పెరిగిన నేపధ్యంలో ఎన్‌హెచ్‌డీసీ స్కీంను తీసుకువచ్చి వారికి ఆసరాగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ అటకెక్కించేశారు. -
చెల్లెలి కోసం చేనేత బహుమతులు
‘‘ఏదోటి కొనిచ్చే దానికంటే మన సమయాన్ని వెచ్చించి మన వాళ్లకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్ చేసి ఇచ్చిన బహుమతుల్లో ప్రేమ ఎక్కువుంటుంది అనే విషయాన్ని నమ్ముతాను’’ అంటున్నారు వరుణ్ ధావన్. రక్షా బంధన్ సందర్భంగా ప్రతి సంవత్సరం తన చెల్లెలకు ఏదో బహుమతి ప్రెజెంట్ చేయడం వరుణ్‌కు అలవాటట. ఈ సంవత్సరం తనే కొన్ని చేనేత చీరలు, దుప్పట్టాలు, డైరీలు.. ఇలా అన్నీ చేత్తో చేసిన సామాన్లను స్వయంగా సెలెక్ట్ చేసి, గిఫ్ట్‌గా బహూకరించదలిచారట. ‘‘ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా చెల్లెలకు గుర్తుండిపోయే గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. ‘సూయి ధాగా’ సినిమా చేస్తున్నప్పుడు మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ గురించి తెలుసుకున్నాను. వాటినే గిఫ్ట్‌గా ఇవ్వదలిచాను. నా చెల్లికి నచ్చుతాయనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
చేనేత గుర్తింపు కార్డులు పొందడం ఇలా..
ధర్మవరం టౌన్ : జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి అంతటి ప్రాధాన్యత ఉంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అందుకు కారణం.. చేనేత కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడమే. సంక్షేమ పథకాలు వర్తించాలంటే ప్రతి కార్మికుడికీ గుర్తింపు కార్డులు తప్పనిసరి. అధికారుల ప్రచారలోపం, చేనేత కార్మికుల అవగాహన లేమితో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా చేనేత కార్మికులు గుర్తింపుకార్డులకు నోచుకోలేదు. జిల్లాలో 1.20 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా కేవలం 62 వేల మంది మాత్రమే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. ఫలితంగా చేనేత కార్మికులు రాయితీ రుణాలు, చేనేత ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలకు అర్హత పొందలేక పోతున్నారు. చేనేత కార్మికులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. చేనేత గుర్తింపు కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. : - చేనేత కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు ఫారం పూర్తి వివరాలతో పూరించాలి. సొంత మగ్గమా..? కూలీ కార్మికుడా అనేది దరఖాస్తు ఫారంలో స్పష్టం చేయాలి. - పూరించిన దరఖాస్తుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను జత చేసి మండల వీఆర్వోతో ధ్రువీకరణ సంతకం చేయించాలి. - ఈ దరఖాస్తును జిల్లా కేంద్రంలో ఉన్న హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయంలోగానీ, డీవో, ఏడీవో ఆయా మండలాలకు సంబంధించిన అధికారికి గానీ ఇవ్వాలి. అధికారులు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వారం రోజుల్లో విచారణ జరిపి ప్రభుత్వ గుర్తింపు కార్డును మంజూరు చేస్తారు. - పై విధంగా చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకొని గుర్తింపు కార్డు పొందితే ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంటుంది. -
చేనేతను నిర్వీర్యం చేశారు
ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపాటు – 30న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్మవరంలో చేనేత ధర్నా ధర్మవరం టౌన్ : పెరిగిన ముడి సరుకు ధరలతో చేనేతల నష్టాల పాలై దుర్భర పరిస్థితులను అనుభవిస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ముడిపట్టు రాయితీ బకాయిని వెంటనే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 30న ధర్మవరం సెరికల్చర్ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 32 నెలల కాలంలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ప్రధానంగా ముడిపట్టు రాయితీ, చేనేత ఆరోగ్యబీమా, ఆర్టిసాన్ క్రెడిట్ ద్వారా రాయితీ రుణాలు, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలను నిర్వీర్యం చేసి, చేనేతలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. చేనేత సంక్షోభానికి పెరిగిన ముడిపట్టు ధరలే కారణమని, ముడిపట్టు గతంలో కిలో రూ.2 వేలు ఉంటే ప్రస్తుతం రూ.4 వేలుకు చేరుకుందన్నారు. దీంతో చేనేత కార్మికులకు రోజు కూలీ రావడం కూడా కష్టమైందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేనేత ముడిపట్టు రాయితీ పథకాన్ని కూడా అటకెక్కించిందన్నారు. ఫలితంగా నేతన్నలకు 15 నెలల ముడిపట్టు రాయితీ పెండింగ్‌లో ఉందన్నారు. రాయితీని రూ.1000కి పెంచుతామని టీడీపీ ప్రభుత్వం మరో నాటకానికి తెరలేపిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినతర్వాత కేవలం 17 నెలలు మాత్రమే రాయితీని పంపిణీ చేసిందన్నారు. అదీ కూడా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాము గతేడాది జూలై నెలలో సంతకాల సేకరణ చేపట్టి, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేసిన ఫలితమేనన్నారు. గత ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు ధర్మవరంలో చేనేతల సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని, రాయితీని వెయ్యికి పెంచుతున్నామని హామీ ఇచ్చి వెళ్లిపోయారన్నారు. సీఎం హామీ ఇచ్చి ఐదు నెలలైనా అమలు కాకపోవడం దారుణమన్నారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ససీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ చేనేత ధర్నాకు మద్దతు తెలిపిన అఖిల పక్ష పార్టీలకు , అన్ని చేనేత సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేనేత ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని చేనేతలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు కుమారస్వామి, కంబగిరి, పాలబావి శ్రీన, తేజ, శివశంకర్, కడపల రంగస్వామి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
మగ్గిపోతున్న నేతన్న
కూడు, గూడు, గుడ్డ.. ఇవే మనిషి మనుగడకు అవసరమైనవి. డిజిటల్ యుగంలో మానవుడు ఎంతగా దూసుకుపోతున్నా.. ఇవి లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేడన్నది జగమెరిగిన సత్యం. అంతటి ప్రాధాన్యమున్న ఆయా రంగాలపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులు చితికిపోతున్న తరుణంలో.. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నతో పాటు అతడికి కూడు పెట్టే చేనేత సొసైటీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. – సఖినేటిపల్లి చేనేత కార్మికుల అభ్యున్నతికి కోసం ఏర్పాౖటెన చేనేత సహకార సంఘాలు కష్టాల్లో ఉన్నాయి. సంఘాల్లో దుస్తుల నిల్వలు పేరుకు పోవడంతో కార్మికులకు పని కల్పించలేని స్థితికి సంఘాలు చేరుకున్నాయి. సంఘాల్లో తయారైన దుస్తులను కొనుగోలు చేయాల్సిన ఆప్కో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేది ఆప్కో. తమ సంస్థకు చెందిన దుకాణాల్లో దుస్తుల అమ్మకాలు పూర్తయ్యాకే సొసైటీల్లో పేరుకుపోయిన దుస్తులు కొనుగోలు చేస్తామని ఆప్కో చెబుతోంది. ఈ తరుణంలో సంఘాలు గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోయి, కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోరి చేనేత సహకార సంఘంలో ఆప్కో కొనుగోళ్లు లేక దుస్తుల నిల్వలు రూ.60 లక్షలకు పేరుకుపోయాయి. రూ.10 కోట్ల విలువైన నిల్వలు జిల్లావ్యాప్తంగా 50 చేనేత సంఘాల్లో రూ.10 కోట్ల విలువైన దుస్తులు పేరుకుపోయినట్టు సంఘ ప్రతినిధులు చెప్పారు. ఆయా సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న దుస్తుల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే కార్మికులకు పని కల్పించడానికి వీలవుతుందని అంటున్నారు. పది సంఘాలకే రిబేటు! సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చిన సొసైటీల్లోని దుస్తుల నిల్వల జాబితా ఆధారంగా జిల్లాలో కేవలం పది సంఘాలకే రిబేటు సౌకర్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఇందులో అప్పట్లోనే రూ.48 లక్షలు నిల్వలున్నట్టుగా ఇచ్చిన నివేదిక ఆధారంగా మోరి సొసైటీకి రిబేటు తాత్కాలికంగా ఇచ్చారు. శాశ్వత రిబేటుకోసం నిరీక్షణ శాశ్వత ప్రాతిపదికన రిబేటు సౌకర్యం ప్రకటించాలని సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దుస్తుల అమ్మకాలు ఏడాది పొడవునా సాగించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. సక్రమంగా లేని రిబేటు సౌకర్యం వల్ల అమ్మకాలు పెరగడం లేదని, వస్త్ర ప్రపంచంలో పోటీతత్వం తట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. నిబంధనలు లేని రిబేటు ఇవ్వాలి ఏడాది పొడవునా షరతులు, నిబంధనలు లేని రిబేటు సౌకర్యం సంఘాలకు కల్పించాలి. 20 శాతం రిబేటు సౌకర్యాన్ని శాశ్వతంగా కొనసాగించమని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు రూ.150 కోట్లు భరించడం కష్టమని, దీనిని రూ.50 కోట్లకు పరిమితం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండేళ్ల క్రితం రూ.40 కోట్ల మేర రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన దుస్తుల నిల్వ లకు తగ్గట్టుగా ఆయా సంఘాలకు ఇప్పుడు రిబేటు అమలవుతోంది. చెన్నైలో లాగే నేత కార్మికులకు మగ్గం వద్ద సబ్సిడీపై విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నాం. – చింతా వీరభద్రేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా చేనేత సంఘాల సమాఖ్య, మోరి -
మాఫికి టోపి
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ∙ఏళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు నయాపైసా కూడా మాఫీ కాని వైనం పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా నెరవేరకపోవడంతో.. తాము నట్టేట మునిగామని నేతన్నలు వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా. మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్‌లూమ్స్‌కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో డబ్బు పడితే ఖతం మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. -
చేనేత రుణాల్లో పైసా మాఫీ చేయని చంద్రబాబు
సదుం: చేనేత కార్మికుల రుణాల్లో ఒక్క రూపాయి రుణాన్ని కూడా సీఎం చంద్రబాబు మాఫీ చేయరని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం జాండ్రపేటలో నిర్వహించిన ప్రపంచ చేనేత దినోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు పలు పథకాలను ప్రకటించి, ప్రభుత్వం ఏర్పాటుచేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంత వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చేనేత దినోత్సవంలో నాయకులు నిలదీస్తారనే భయంతో వ్యూహాత్మకంగా అనంతపురంలో ఒక్కరోజు ముందు రూ.111 కోట్ల చేనేత రుణాల మాఫీ, రూ.3 లక్షలతో గృహాలు కట్టిస్తామని ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తుందన్నారు. నేతన్నలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలన్నీ అమలుచేసి వారి కష్టాలను తీరుస్తామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మెన్ పెద్దిరెడ్డి, చేనేత సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రవి, చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో చేనేత రంగం
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు పట్టణంలో ఘనంగా చేనేత దినోత్సవం మంగళగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని రాష్ట్ర చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో చేనేత జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడారు. పరిశ్రమను రక్షించేందుకు ప్రయత్నాలు చేయని పాలకులు, దాన్ని నాశనం చేసేందుకు విదేశీ వస్త్రాలను దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. మరమగ్గాలు రంగ ప్రవేశం చేయడంతో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మర్రి సాంబశివరావు, బత్తూరి మోహనరావు, రావుల శివారెడ్డి, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, గంజి శ్రీనివాసరావు, ఉడతా వెంకటేశ్వర్లు, నందం బ్రహ్మేశ్వరావు, గంజి వెంకయ్య, కొల్లి కిషోర్, మానం శ్రీను తదితరలు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లో.. ఏరియా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతారపు వెంకటేశ్వరావు, డోకిపర్తి రామారావు, చిట్టేల సీతారామాంజనేయులు, కారంపూడి అంకమ్మరావు, జంజనం శివభవన్నారాయణ, ఉద్దంటి తిరుమలస్వామి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చేనేత వస్త్రదుకాణాలు, మగ్గాల వద్దకు వెళ్లి పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాసరావు, నాయకులు జగ్గారపు రామ్మోహనరావు, సానా చౌడయ్య తదితరులు పాల్గొన్నారు. వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక షరాఫ్ బజార్‌లోని కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవి, సంఘం నాయకులు జొన్నాదుల వరప్రసాదరావు (గాంధీ), మురుగుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
'బాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా?'
హైదరాబాద్: పోలవరం విషయంలో తెలంగాణను ప్రశ్నించే పరిస్థితి కూడా ఏపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. '1650 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఓవైపు చెబుతారు. 8 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లామని మరోవైపు చెబుతారు. వరద నీళ్ల స్టోరేజి కోసమే పోలవరం కడుతున్నారు. అందుకే దాన్ని పోలవరం అంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకుంటే, తర్వాత నీళ్లు డైవర్ట్ చేయగలిగితే కృష్ణాకైనా, శ్రీశైలానికైనా ఇవ్వచ్చు. కానీ మీ పట్టిసీమలో స్టోరేజి అనేది లేదు. అదే మీరు చేస్తున్న అన్యాయం. పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టును కాంప్రమైజ్ చేస్తారు. చివరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు' అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మరోవైపు చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ చేనేత కార్మికులెవరికీ రుణాలు మాఫీ కాలేదని, సబ్సిడీలు అందడం లేదని అన్నారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే అనే గుర్తు చేశారు. కానీ, వారి పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దయనీయంగా మారిందని చెప్పారు. రూ.110 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామంటున్నారని కానీ ఎక్కడా మాఫీ కాలేదని అన్నారు. ధర్మవరంలో 12మంది కార్మికులు చనిపోతే వాళ్లింటికి వెళ్లి బాధలు విన్నామని చెప్పారు. చేనేత కార్మికులంతా విలవిల్లాడుతుంటే, 22 వేలమందికి మాత్రమే రుణమాఫీ చేశాం, అంతటితో అయిపోయిందంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణ పరిస్థితికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు వైస్ జగన్ చెప్పారు. -
'చేనేతను ఆదుకుంటాం'
విశాఖపట్టణం: చితికిపోయిన చేనేతను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా కసింకోటలోని చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ.3 లక్షల రూపాయలతో వర్కింగ్ షెడ్డు, ఇల్లు నిర్మించి ఇస్తామని, 400 కోట్లతో జనతా వస్త్రాల పథకం అమలు చేస్తామని చెప్పారు. అలాగే చేనేతలు తీసుకున్న రూ.169 కోట్ల వ్యక్తిగత రుణాలను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు చేయించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.