
సాక్షి, విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలోని వేమన మందిరం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ తన కుటుంబంతో కలిసి వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని ఈ సందర్భంగా లక్ష్మీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment