సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ తరవాత విశాఖపై అంతటి ప్రేమ చూపిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖలో మాట్లాడుతూ, ‘విశాఖలో అభివృద్ది గతంలో దివంగత వైఎస్సార్ హయాంలోనే జరిగింది. విశాఖకి బీటీ రోడ్ వైఎస్సార్ తీసుకువచ్చారు. విశాఖ అభివృద్దిలో వైఎస్సార్ ముద్ర స్పష్డంగా కనిపిస్తుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత చంద్రబాబు కుట్రలు ప్రారంభించారు. విశాఖ పరిపాలనా రాజధాని కాకూడదని ప్రతి విషయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖకి పరిపాలనా రాజధాని వస్తుంది. రాబోయే రోజులలో విశాఖ అభివృద్దికి ప్రత్యేకమాస్టర్ ప్లాన్ రూపొందించాం. భవిష్యత్ లో విశాఖ అభివృద్దిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టేలా, విశాఖకి పరిపాలనా రాజధాని వచ్చేందుకు ప్రజలు అండగా నిలబడాలి’ అని విజయసాయి రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment