
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు.. తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు సోదరి ప్రియాంకతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన 40 నిమిషాల్లోనే దాదాపు 18 వేల లైక్‌లు వచ్చాయి. మరో వైపు ప్రియాంక గాంధీ కూడా రాఖీ సందర్భంగా సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. (ఉన్నాను నీకు తోడుగా)
Wishing every one a happy #RakshaBandhan.
— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2020
आप सभी को रक्षाबंधन की शुभकामनाएँ। pic.twitter.com/EJZWPSGO2J
‘కష్ట, సుఖాల్లో నా సోదరుడితో కలిసి జీవించడం వల్ల నేను తన నుంచి నేను ప్రేమ, ఓర్పు, వాస్తవం వంటి వాటిని అవర్చుకున్నాను. నీ లాంటి సోదరుడు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను. రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
हर सुख-दुख में साथ रहते हुए मैंने अपने भाई से प्रेम, सत्य और धैर्य का साथ सीखा है। मुझे ऐसा भाई मिलने पर गर्व है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2020
समस्त देशवासियों को पावन पर्व #रक्षाबंधन की हार्दिक शुभकामनाएं।#RakshaBandhan pic.twitter.com/KWTGpTZQYy