సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్‌లో సోమవారం జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రేపు జరగాల్సిన వేడుకలను రాజ్ భవన్ రద్దు చేసింది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్ మాస్కులు ధరించి, జాగ్రత్తలతో ఇంటి వద్దే పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్బు లేదా శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.
(చదవండి : నూలు వెచ్చని రక్షాబంధం)
ఏపీ రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు రద్దు
Published Sun, Aug 2 2020 2:50 PM | Last Updated on Sun, Aug 2 2020 3:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment