గోపాలపట్నం : రక్షాబంధన్ మా బంధాన్ని తెంచే స్తుందని ఊహించ లేదు. రాఖీ కట్టేందు కు రాకపోయి ఉంటే నా అన్న బతికేవాడు అని ఆ చెల్లెలు ఆవేదన అందర్నీ కలచివేసింది. గురువారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎన్‌ఏడీ ఫ్లై వోవర్‌పై ట్రాలర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన కొంచాడ గోవిందరావు (27) (అలియాస్ గోపి) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎయిర్‌పోర్టు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అగనంపూడిలో నివాసముంటున్న చెల్లి పద్మ ఇంటికి సాయంత్రం ద్విచక్రవాహనంపై గోవిందరావు వెళ్లాడు. రాఖీ కట్టి, చెల్లిని ఆశీర్వదించి తిరుగుపయనమయ్యాడు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి స్టీల్‌ప్లాంట్ నుంచి ఇరన్ లోడుతో వెళుతున్న ట్రాలర్ లారీ మురళీ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వెనుక చక్రాల కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు నెలల క్రితమే విశాఖకు.. : నిమ్మాడ నుంచి రెండు నెలల క్రితమే మురళీ విశాఖ వచ్చాడు. నగరంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా చేరాడు. మురళీనగర్‌లో తన స్నేహితుడు ఇంట్లో ఉంటున్నాడు. మృతునికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు. తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు సీఐ బీఎండీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment