దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్‌ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్‌ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.
స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్‌లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment