ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్‌పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్‌పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.
‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి.
రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు.
ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment