ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం ముంబై పోలీసులకు లేఖ రాసింది. రియాతోపాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉన్న క్రమంలో సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డిమాండ్ మేరకు డీఆర్‌డీఓ అతిథి గృహం నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో రియా చక్రవర్తికి భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. అయితే గురువారం రియా చక్రవర్తి ఇంటి ముందు మీడియా వ్యక్తులు తనను వేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని రియా ముంబై పోలీసులను కోరారు. కొంతమంది మీడియా వ్యక్తులు తన బిల్డింగ్ కాంపౌండ్‌లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శనివారం రియా ఆమె సోదరుడు షోవిక్‌లు సీబీఐ దర్యాప్తు కోసం డీఆర్‌డీఓ కార్యాలయానికి బయలు దేరే ముందే వారికి రక్షణ కల్పించేందుకు ముంబై పోలీసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. కాగా సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను సీబీఐ అధికారులు శుక్రవారం 10 గంటలకు పైగా విచారించారు. ముఖ్యంగా రియా, సుశాంత్ మధ్య ఉన్న సంబంధం గురించి వారు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment