సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాళ్లు ఎం చేస్తారు? ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అయితే అది కొంతవరకు బాగానే ఉన్నా..ఒక్కోసారి వారిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. వాళ్లకు ప్రైవసీని భంగం కలించినట్లవుతుంది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌కు అలాంటి ఘటనే ఎందురైంది.ఆమె లివింగ్ రూమ్‌లో కూర్చొని ఉండగా.. సీక్రెట్‌గా ఫోటోలు తీసేందుకు ఇద్దరు ఫోటో గ్రాఫర్లు ప్రయత్నించారు. పక్క బిల్డింగ్ టెర్రస్‌పై నిలబడి కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా.. సోషల్ మీడియా వేదికగా వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది.
‘నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండగా.. ఎవరో నన్ను గమనించినట్లు అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఇద్దరు వ్యక్తులు పక్క బిల్డింగ్‌పై నుంచి కెమెరాలతో నా ఫోటోలు తీస్తున్నారు. ఇది సరైన పనేనా? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించాలనే విషయం తెలియదా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది. ఇన్‌స్టా పోస్ట్‌లో ముంబై పోలీసుకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. నా కూతురి విషయంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఫోటోలను తీయొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా..వారు ఆమె ఫోటోలను నెట్టింట పెట్టారు’అని రాసుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘ఆది అసహ్యమైన చర్య. నా విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాకు తెలియకుండా.. నా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీశారు’చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment