ఆ ఫోటో నాది కాదు, మార్ఫింగ్‌ చేశారు.. రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త ట్విస్ట్‌ | Bollywood Actor Ranveer Singh tells Mumbai Cops photo revealing private parts is ‘morphed’ | Sakshi
Sakshi News home page

Ranveer Singh: ఆ ఫోటో నాది కాదు, మార్ఫింగ్‌ చేశారు.. రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త ట్విస్ట్‌

Sep 15 2022 1:01 PM | Updated on Sep 17 2022 2:40 PM

Bollywood Actor Ranveer Singh tells Mumbai Cops photo revealing private parts is ‘morphed’ - Sakshi

సోషల్‌ మీడియాలో నగ్న ఫోటోలు పెట్టిన వ్యవహారంలో రణ్‌వీర్‌ సింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు రణ్‌వీర్‌ కొత్త ట్విస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో ఒకటి తనది కాదని, ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసిన‌ట్లు ర‌ణ్‌వీర్ ఆరోపించారు. ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్‌వీర్‌ సింగ్ ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ఓ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను రణ్‌వీర్‌  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి.  దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యం‍తరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement