ప్రధాని మోదీ హత్యకు ప్లాన్‌ అంటూ బెదిరింపు కాల్‌.. మహిళ అరెస్ట్‌ | Mumbai Police arrested Woman for threatening to kill PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ హత్యకు ప్లాన్‌ అంటూ బెదిరింపు కాల్‌.. మహిళ అరెస్ట్‌

Published Thu, Nov 28 2024 1:14 PM | Last Updated on Thu, Nov 28 2024 1:20 PM

Mumbai Police arrested Woman for threatening to kill PM Modi

ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్‌, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. 

కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement