పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్‌ 1992’ నటుడు ఆవేదన | Scam 1992 Actor Pratik Gandhi Tweet Police Pushed Him At Mumbai Road | Sakshi
Sakshi News home page

Scam 1992 Actor: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్‌ పట్టుకుని..

Published Mon, Apr 25 2022 8:43 PM | Last Updated on Mon, Apr 25 2022 9:38 PM

Scam 1992 Actor Pratik Gandhi Tweet Police Pushed Him At Mumbai Road - Sakshi

Actor Pratik Gandhi Tweet Police Pushed Him By Shoulder: తనని ముంబై పోలీసులు ఘోరంగా అవమానించారంటూ ‘స్కామ్‌ 1992’ ఫేం, బాలీవుడ్‌ ప్రతీక్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ముంబై పోలీసుల తీరుపై ఆసహనం వ్యక్తం చేశాడు. నిన్న(ఆదివారం) సాయంత్రం వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే(డబ్ల్యూఈహెచ్‌) రోడ్డుపై నడుస్తుండగా పోలీసులు కాలర్‌ పట్టుకుని పక్కకు తోసేశారని ప్రతీక్‌ తెలిపాడు.

చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్‌ డేస్‌ అంటే అసహ్యం: షాహిద్‌ కపూర్‌ 

‘ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ ఎవరో వస్తున్న కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. అదే సమయంలో నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై అటుగా నడుస్తున్నాను. ఈ క్రమంలో పోలీసులు నా షోల్డర్‌ పట్టుకుని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏదో మార్బుల్ గోడౌన్‌లోకి నెట్టారు. నిజంగా ఇది అవమానం’ అంటూ ట్వీట్ ప్రతీక్‌ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్‌ చరణ్‌

ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మేరకు పలువురు ఆయనకు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా ముంబైలోని కీలకమైన వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రజల రాకపోకలను నిలిపివేశారు. కాగాప్రస్తుతం  ప్రతీక్ గాంధీ ‘ఫూలే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రతీక్ ‘జ్యోతి బాఫూలే’గా, పత్రలేఖ ‘సావిత్రి ఫూలే’గా నటిస్తున్నారు. అంతేగాక విద్యాబాలన్, ఇలియానాలు ఫిమెల్ లీడ్‌రోల్‌లో ప్రతీక్‌ గాంధీ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement